ఎన్టీఆర్‌(NTR)-కొరటాల శివ(Koratala shiva) కాంబినేషన్‌లో త్వరలో రాబోతున్న దేవర(Devara) సినిమా పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది

ఎన్టీఆర్‌(NTR)-కొరటాల శివ(Koratala shiva) కాంబినేషన్‌లో త్వరలో రాబోతున్న దేవర(Devara) సినిమా పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌నే కాదు, సినిమా అభిమానులను కూడా అలరిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్‌ కానున్న దేవర ట్రైలర్‌(Devara Trailer) కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్‌లో(Overseas) దేవరకు బ్రహ్మండమైన ఆదరణ కనిపిస్తున్నది. అక్కడ ఇప్పటికే ప్రీసేల్ టికెట్ బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. టికెట్స్‌ అన్నీ హాట్‌ కేకుల్లా అమ్మడుపోయాయి. ఈ విషయంలో దేవర రికార్డు సృష్టించింది. వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల కానున్న దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఓవర్సీస్‌లో ఇప్పటికే టికెట్స్‌ సేల్‌(Tickets sale) ప్రారంభమైంది. సినిమా రిలీజ్ కావడానికి ముందే అక్కడ పది లక్షల దేవర టికెట్స్‌ అమ్ముడయ్యాయి. నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ మార్క్‌ను వేగంగా అందుకున్న సినిమాగా దేవర రికార్డ్‌ సృష్టించింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా అక్కడ ఈ రికార్డ్‌ అందుకోలేదు. దీంతో మొదటి భారతీయ సినిమాగా దేవర రికార్డు నెలకొల్పింది. ఈ విషయం తెలిసి తారక్‌ అభిమానుల చాలా ఆనందపడుతున్నారు. ట్రైలర్‌ కూడా విడుదల కాకుండానే ఇలా భారీ రికార్డ్స్‌ కొట్టేస్తే. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఇంకెన్ని లెక్కలు మారిపోతాయో అని సోషల్‌ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ముంబాయిలో జరిగే ట్రైలర్‌ లాంచింగ్‌ వేడుక కోసం ఇప్పటికే ఎన్టీఆర్‌, కొరటాల శివ అక్కడికి చేరుకున్నారు. తెలుగు, తమిళ్‌,కన్నడ,మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

Eha Tv

Eha Tv

Next Story