✕
Dimple Hayathi in Green Saree : గ్రీన్ కలర్ శారీలో పద్దతిగా డింపుల్ హయాతి.. !
By EhatvPublished on 21 April 2023 3:24 AM GMT
ఈ బ్యూటీ తాజాగా రామబాణం (Rama Banam) అనే చిత్రంలో మ్యాచో స్టార్ గోపిచంద్ (Tottempudi Gopichand) సరసన నటిస్తోంది. అయితే సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నిండైన చీరకట్టులో పద్దతిగా కనిపించింది. ఎప్పుడూ హాట్‌గా అందాలను ఆరబోసే ఈ భామ... గ్రీన్ కలర్ శారీలో అద్దం ముందు అందరినీ ఆకర్షించేలా ఉన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

x
Dimple Hayathi
-
- డింపుల్ హయాతి (Dimple Hayathi) గ్లామర్ ఒలకబోయడంలో నెంబర్ వన్ అనే చెప్పాలి. డస్కీ బ్యూటీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. ఆ సాంగ్‌తో ప్రేక్షకుల్లో మంచి డ్యాన్సర్ అనిపించుకుంది ఈ భామ. ఇక మాస్ రాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో బీచ్‌లో బికినీలో అందాలను ఆరబోసి.. యూత్‌లో సెగలు పుట్టించింది డింపుల్.
-
- ఈ బ్యూటీ తాజాగా రామబాణం (Rama Banam) అనే చిత్రంలో మ్యాచో స్టార్ గోపిచంద్ (Tottempudi Gopichand) సరసన నటిస్తోంది. అయితే సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నిండైన చీరకట్టులో పద్దతిగా కనిపించింది. ఎప్పుడూ హాట్‌గా అందాలను ఆరబోసే ఈ భామ... గ్రీన్ కలర్ శారీలో అద్దం ముందు అందరినీ ఆకర్షించేలా ఉన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
- చిన్నవయస్సు నుంచే సినిమాలు, టీవీలు చూసి... అందులో వచ్చే నటీనటుల యాక్టింగ్‌ను ప్రాక్టీస్ చేసేదట డింపుల్. దాంతోపాటు సాంగ్స్‌కు డాన్స్ కూడా చేస్తుండేదట ఈ అమ్మడు. క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడంతోపాటు ఎన్నో స్టేజీ షోలు కూడా చేసిందట ఈ బ్యూటీ.
-
- డింపుల్ హయాతి ( Dimple Hayathi) తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది. 1988 ఆగస్టు 21న జన్మించిన ఈ అమ్మాయికి మొదట డింపుల్ అని పేరు పెట్టారట తల్లిదండ్రులు. అయితే ఆ పేరు మరీ చిన్నగా ఉందని న్యూమరాలజీ ప్రకారం డింపుల్ ( Dimple) పక్కన హయాతి (Hayathi)) అనే పేరు చేర్చారట. డింపుల్‌కి చిన్నప్పటి నుంచే నటి అవ్వాలనే కోరిక బలంగా ఉండేదట.
-
- ఇక 2021లో వచ్చిన ఆత్రంగిరే చిత్రంలోనూ మెరిసింది. 2022లో ‘సామాన్యుడు’, ‘ఖిలాడి’ చిత్రాలు చేసింది. ఖిలాడిలో బీచ్‌లో బికినీ డ్రెస్‌లో ఆడియన్స్‌లో సెగలు పుట్టించింది ఈ హాట్ భామ. డింపుల్ అడపాదడపా తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. ఇన్ని ప్రయత్నాలు చేసినా అమ్మడుకి సరైన బ్రేక్ రావడం లేదు. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది ఈ భామ.
-
- 2018లో నిర్వహించిన ‘మిస్ దివా-2018’ పోటీల్లోనూ పార్టిసిపేట్ చేసి.. మిస్ దివా టైటిల్‌ను కైవసం చేసుకుని.. ఆ తర్వాత ప్యారిస్ వెళ్లి అక్కడ కూడా మోడలింగ్ చేసింది డిపుల్. ఇక ఈ భామ ఫ్రీ టైమ్‌లో జిమ్‌కు వెళ్లి తన బాడీని ఫిట్‌గా ఉంచుకుంటుందట. ఈ అమ్మాయికి తమిళ హీరో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi) సినిమాలంటే మహా ఇష్టమట.
-
- ఖాళీ సమయాల్లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సినిమాలు చూడటంతోపాటు ఇటు క్లాసికల్ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తుందట ఈ బ్యూటీ. ఈ అమ్మడు ఫిట్నెస్ గురించి ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలా చేస్తూనే ఇన్‌స్టా క్వీన్‌గా పేరు తెచ్చుకుంది ఈ తెలుగమ్మాయి.
-
- ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో తన ఫ్యాన్స్ గుండెల్లో సెగలు పుట్టిస్తుంటోంది ఈ డింపుల్. ఈ అమ్మడు 2017లో వచ్చిన ‘గల్ఫ్’ చిత్రంలో లక్ష్మీ క్యారెక్టర్‌తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇక 2019లో ‘యురేక’, ‘దేవీ2’, ‘అభినేత్రి 2’ చిత్రాల్లోనూ డింపుల్ నటించింది. ప్రస్తుతం డింపుల్ హయాతి (Dimple Hayathi)కి ఇన్‌స్టా గ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story