లతా మంగేష్కర్‌(Lata Mangeshkar) సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అద్భుతమైన గాయనీమణులు ఉండేవాడు. ఒకరిని మించిన వారొకరు! నూర్జహాన్‌(Nurjahan), షంషాద్‌ బేగంలు సరేసరి! వీరితో పాటు సురయ్య, గీతారాయ్‌లు కూడా అద్భతమైన నేపథ్యగాయకురాళ్లుగా చెలామణి అవుతున్న కాలమది! నూర్జహాన్‌ అగ్రశ్రేణి గాయకురాలు కాబట్టి లతా మంగేష్కర్‌ ఆమెనే ఎక్కువగా అనుకరించేది!

లతా మంగేష్కర్‌(Lata Mangeshkar) సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అద్భుతమైన గాయనీమణులు ఉండేవాడు. ఒకరిని మించిన వారొకరు! నూర్జహాన్‌(Nurjahan), షంషాద్‌ బేగంలు సరేసరి! వీరితో పాటు సురయ్య, గీతారాయ్‌లు కూడా అద్భతమైన నేపథ్యగాయకురాళ్లుగా చెలామణి అవుతున్న కాలమది! నూర్జహాన్‌ అగ్రశ్రేణి గాయకురాలు కాబట్టి లతా మంగేష్కర్‌ ఆమెనే ఎక్కువగా అనుకరించేది! ఆ అనుకరణ నుంచి బయటపడేసిన వ్యక్తి సంగీత దర్శకుడు సి.రామచంద్ర(C.Ramchandra). అంతకు ముందు అనిల్‌ బిశ్వాస్‌(Anil Biswas) దగ్గర పాటపాడే అవకాశం లతకు వచ్చింది. పాట పాడుతూ మధ్యలో ఊపిరి పీల్చుకోవలసి వచ్చినప్పుడు, ఆ స్వర ప్రవాహానికి అడ్డు రాకుండా ఊపిరి ఎలా పీల్చుకోవాలో నేర్చించారు అనిల్‌ బిశ్వాస్‌.

దాన్ని లత కఠోరంగా సాధన చేసింది. లతలోని నేర్చుకోవాలన్న తపన, కఠోర శ్రమ అనిల్‌ బిశ్వాస్‌కు బాగా నచ్చాయి. ఓ రోజు ఇద్దరూ కలిసి గోరేగావ్‌లో ఉన్న ఫిల్మిస్తాన్‌ స్టూడియోకు లోకల్‌ ట్రైయిన్‌లో వెళుతున్నారు. అప్పట్లో బొంబాయిలో సినిమా స్టూడియోలు నగర శివారులో ఉండేవి. కళాకారులేమో నగరంలో ఉండేవారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి ఉన్నారు కాబట్టి వారికి సొంత కార్లు కూడా ఉండేవి కావు. అందుకే లోకల్‌ ట్రైన్‌లోనే వెళ్లి వచ్చేవారు. ట్రైన్‌లో వెళుతున్నప్పుడు అనిల్‌ బిశ్వాస్‌కు ఏదైనా ట్యూన్‌ తడితే సిగరెట్‌ పెట్టెమీద తాళం వేస్తూ అది గాయనీగాయకులకు నేర్పించేవారు. వారితో ప్రాక్టీస్‌ చేయించేవారు. అనిల్‌ బిశ్వాస్‌, లతా వెళుతున్న ట్రైన్‌లోనే బాంద్రా స్టేషన్‌లో దిలీప్‌కుమర్‌ ఎక్కాడు. ఆయన కూడా స్టూడియోకే వెళుతున్నాడు.

అప్పటికీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అనిల్‌ బిశ్వాస్‌ను పలకరించాడు. పక్కనే ఉన్న లతను దిలీప్‌కు పరిచయం చేశాడు అనిల్‌ బిశ్వాస్‌. ఈమె చాలా ప్రతిభావంతురాలు, చాలా గొప్పగా పాడుతుంది అని చెప్పుకొచ్చాడు. అప్పుడు లతాను చూశాడు దిలీప్‌. సన్నగా, చామనఛాయతో ఉన్న లతను చూసి ఈ మరాటి పిల్ల హిందీ పాటలు పాడటమేమిటని మనసులో అనుకున్నాడు.అందుకు కారణం అప్పటున్న సింగర్లంతా సంజాబ్‌, సింధు ప్రాంతాలనికి చెందిన ముస్లింలు. వారి ఉర్దూ ఉచ్ఛారణ స్వచ్ఛంగా ఉండేది. లతానేమో మహారాష్ట్రకు చెందిన అమ్మాయి. అందుకే దిలీప్‌ సందేహపడ్డాడు.

అంతా బాగానే ఉంది కానీ వీరి ఉర్దూ పప్పనంలా ఉంటుందని లతను ఎగతాళి చేశాడు. అది విన్న లతా కుంగిపోలేదు. ఏడుస్తూ కూర్చోలేదు. వెంటనే ఓ మౌల్వీని ట్యూటర్‌గా పెట్టుకుంది. కొద్ది కాలంలోనే చక్కటి ఉర్దూ నేర్చుకుంది. సంగీత దర్శకుడు నౌషాద్‌ దగ్గర శిష్యరికం చేసి ఉర్దూ పాటలను ఎలా పాడాలో తెలుసుకుంది. క్లిష్టమైన ఉర్దూ పదాలను ఎలా పలకాలో నేర్చుకుంది. ఇది జరిగిన కొన్నాళ్లకే లతా మంగేష్కర్‌కు దిలీప్‌కుమార్‌(Dilip Kumar) వీరాభిమానిగా మారిపోయాడు. తెలిసీ తెలియకుండా తను చేసిన కామెంట్లకు క్షమాపణ చెప్పుకున్నాడు.

Updated On 28 Sep 2023 6:59 AM GMT
Ehatv

Ehatv

Next Story