చిన్నసినిమాలను ఇబ్బందులు పెడుతున్నారన్న వ్యాఖ్యలపై దిల్‌రాజ్(Dilraju) ఫైర్ అయ్యారు. ప్రసాద్ ల్యాబ్‌లో(Prasad Labs) జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ఆగ్రహం చెందారు. ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారని.. ప్రతి సంక్రాంతికి(Sankarnthi) సినిమాలు విడుదలవుతుంటాయి కానీ నాపై ప్రతీ సంక్రాంతి సమయంలో విమర్శలు చేస్తున్నారని ఆయన వాపోయారు.
చిన్నసినిమాలను ఇబ్బందులు పెడుతున్నారన్న వ్యాఖ్యలపై దిల్‌రాజ్(Dilraju) ఫైర్ అయ్యారు. ప్రసాద్ ల్యాబ్‌లో(Prasad Labs) జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ఆగ్రహం చెందారు. ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారని.. ప్రతి సంక్రాంతికి(Sankarnthi) సినిమాలు విడుదలవుతుంటాయి కానీ నాపై ప్రతీ సంక్రాంతి సమయంలో విమర్శలు చేస్తున్నారని ఆయన వాపోయారు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి(Chiranjeevi) నిన్న నాపై మాట్లాడిన మాటలకు కొన్ని వెబ్ సైట్లు(Websites) తప్పుగా వక్రీకరించాయని దిల్‌రాజ్ అన్నారు.
ఈ సందర్భంగా వెబ్‌సైట్లు, యూట్యూబ్(Youtube) చానెళ్లకు వార్నింగ్ ఇచ్చారు. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తానన్నారు, వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. తమిళ సినిమాను నేనే వాయిదా వేశాను..హను-మాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పా. నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి. నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు కూడా థియేటర్లు దొరకడంలేదన్నారు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. నేను ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటానంటూ.. మీ వైబ్ సైట్ల హైప్ కోసం నన్ను వాడుకుంటే తాటతీస్తానని దిల్ రాజు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.