తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలంగాణ యాస సినిమాల హవా మంచి ఊపులో ఉంది. ఇప్పుడు నాని దసరా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా రిలీజైన టీజర్ ఫ్యాన్స్ తోపాటు అందరినీ బాగా ఆకట్టుకుంది. ఏ నోట చూసిన నాని ఊరమాస్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో ఈ సినిమా ’పుష్ప’ను మించి ఉంటుందంటున్నారు. సాధారణంగా ప్రీరిలీజ్ ఈవెంట్లలో డైరెక్టర్లు హీరోలకు హైప్ ఇస్తారు.. కానీ ఈ సినిమా విషయంలో డైరెక్టర్ శ్రీకాంత్ టాలీవుడ్ కి, ఇండియన్ […]

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలంగాణ యాస సినిమాల హవా మంచి ఊపులో ఉంది. ఇప్పుడు నాని దసరా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా రిలీజైన టీజర్ ఫ్యాన్స్ తోపాటు అందరినీ బాగా ఆకట్టుకుంది. ఏ నోట చూసిన నాని ఊరమాస్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో ఈ సినిమా ’పుష్ప’ను మించి ఉంటుందంటున్నారు.

సాధారణంగా ప్రీరిలీజ్ ఈవెంట్లలో డైరెక్టర్లు హీరోలకు హైప్ ఇస్తారు.. కానీ ఈ సినిమా విషయంలో డైరెక్టర్ శ్రీకాంత్ టాలీవుడ్ కి, ఇండియన్ సినిమాకు గ్రేట్ కాంట్రిబ్యూషన్ అని నాని అన్నారు. దీంతో సినిమాకు రేంజ్ పెరిగిపోయింది. మరో ఈ వైపు ఈ సినిమా టీజర్ దిల్ రాజుకు బాగా నచ్చిందట.

ఈ సినిమాను తెలంగాణ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు తన ఫోల్డ్ లోకి తీసుకున్నారని సమాచారం. టీజర్ బాగా నచ్చడంతో దిల్ రాజు మంచి ఆఫర్ ఇచ్చి చదలవాడ శ్రీనివాసరావు దగ్గర హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు నటుడిగా మంచి పేరు తెస్తుందని, కమర్షియల్ గా కూడా మంచి హిట్ అవుతుందని నాని భావిస్తున్నారు. సినిమాను హిందీలో కూడా నేరుగా విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాపై బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ సంతోష్ నారాయణణ్, సినిమాటోగ్రఫీ సత్యాన్ సూర్యన్ అందిస్తున్నారు. 2023 మార్చి 30న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Updated On 2 Feb 2023 2:48 AM GMT
Ehatv

Ehatv

Next Story