తన సినిమాను కాపాడుకోడానికి దిల్ రాజు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు
సినిమాలకు వచ్చే రివ్యూలు అటు నిర్మాతలను, ఇటు సినీ ఇండస్ట్రీని చంపేస్తున్నాయని నిర్మాత దిల్ రాజు అన్నారు. 3 రోజుల తర్వాత.. వారాంతం తర్వాత మాత్రమే రివ్యూలు వచ్చేలా చట్టం ఉండాలని ఆయన భావిస్తూ ఉన్నారు. కేరళలో ఉన్న రివ్యూ సిస్టమ్‌ను ఉదాహరణగా చెప్పారు దిల్ రాజు. దిల్ రాజు తన ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాకి వచ్చిన రివ్యూల గురించి మాట్లాడాడు. కొందరు వ్యక్తులు ఫ్యామిలీ స్టార్ సినిమాను టార్గెట్ చేసి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన సినిమాను కాపాడుకోడానికి దిల్ రాజు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిందని ఆయన అంటున్నారు. అంతేకాకుండా దిల్ రాజు ఈ చిత్రానికి రివ్యూ రిపోర్టర్‌గా మారారు. థియేటర్‌లో చాలా మంది అభిప్రాయాలను కూడా ఆయనే స్వయంగా అడిగారు. భారీ హైప్ మధ్య విడుదలైన ఫ్యామిలీ స్టార్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా చూసి విజయ్ దేవరకొండ అభిమానులు కూడా నిరాశ చెందారు.