బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. అర్జున్ రెడ్డితో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.

Dil Raju impressed with Sandeep Reddy Vanga’s Animal and acquires Telugu states rights
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటిస్తున్న చిత్రం ‘యానిమల్’(Animal). అర్జున్ రెడ్డి(Arjun Reddy)తో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ వంగా(Sandeep Reddy Vanga) ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత గ్యాప్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగ.. బాలీవుడ్(Bollyood) కి వెళ్లి ‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశాడు అంతే. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ ను పట్టాలెక్కించాడు.
రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యానిమల్ చిత్రం మీద అంచనాలు ఒక రేంజిలో ఉండడంతో తెలుగు హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకున్నారు.
టాలీవుడ్‌లో దిల్ రాజు చాలా ఏళ్లుగా అగ్ర నిర్మాతగా ఉన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాక కూడా ఇండస్ట్రీలో తనని నిలబెట్టిన డిస్ట్రిబ్యూషన్ ని వదులుకోలేదు. ఓ వైపు సొంతంగా భారీ సినిమాలని నిర్మిస్తూ ఉన్నా.. డిస్ట్రిబ్యూషన్‌లో కూడా బిజీగా ఉన్నారు.
