విజయ్‌ సేతుపతి(vijay Sethupati) హీరోగా వచ్చిన మహారాజ(MahaRaja) సినిమా ఊహించినదానికంటే గొప్ప హిట్టయ్యింది.

విజయ్‌ సేతుపతి(vijay Sethupati) హీరోగా వచ్చిన మహారాజ(MahaRaja) సినిమా ఊహించినదానికంటే గొప్ప హిట్టయ్యింది. థియేటర్లలోనే కాదు, ఓటీటీ(OTT)లో కూడా సినిమా బ్రహ్మండమైన హిట్‌ కొట్టింది. చూసినవారంతా శభాష్‌ అంటున్నారు. చిత్రమేమిటంటే ఈ సినిమాలో నటించినందుకు విజయ్‌ సేతుపతి ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోలేదట! వైవిధ్యమైన పాత్రలు చేయడానికి విజయ్‌ సేతుపతి ముందుంటారు. విలన్‌ పాత్రలు, తండ్రి పాత్రలు చేయడానికి కూడా వెనుకాడరు. మహారాజ సినిమాలో కూడా సెలూన్‌ షాపు(Salon Shop)లో పని చేసే బార్బర్‌(Barber)గా నటించాడు. మేకప్‌ కూడా లేదు. పైగా భారతీరాజాతో తిట్లు తింటుంటాడు. సమాజంలో చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను చిన్న పాయింట్‌గా తీసుకుని సినిమాను తీశారు. సినిమాలో అనేక ట్విస్టులు ఉంటాయి. క్లయిమాక్స్‌ అయితే అదిరిపోయింది. అందుకే సినిమా అంత పెద్ద హిట్టయ్యింది. ఈ సినిమాను నిర్మాతలు కేవలం 20 కోట్ల రూపాయలతోనే తీద్దామనుకున్నారట! ఈ విషయాన్ని విజయ్‌ సేతుపతికి చెబితే ఆయన కూడా ఓకే అన్నారట! అందుకే పైసా కూడా తీసుకోలేదు విజయ్‌ సేతుపతి. సినిమా హిట్ అయితే లాభాల్లో షేర్‌ ఇస్తామని నిర్మాతలు చెప్పారట. మహారాజ సినిమా ఇప్పటికే వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. మామూలుగా విజయ్‌ సేతుపతి ఒక్కో సినిమాకు పది నుంచి 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటాఉ. ఇప్పుడు లాభాలలో షేర్‌ ఇస్తానన్నారు కాబట్టి పారితోషికం కంటే డబుల్‌ అమౌంట్ రాబోతున్నది.

ehatv

ehatv

Next Story