విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2017లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది.

Did you know Vijay Devarakonda was not the first choice for ‘Arjun Reddy’
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) 'అర్జున్ రెడ్డి'(Arjun Reddy) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2017లో సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అయితే అర్జున్ రెడ్డి పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగ మొదట విజయ్ దేవరకొండను అనుకోలేదట.
ఈ సినిమాలో అర్జున్ రెడ్డి పాత్రలో అల్లు అర్జున్(Allu Arjun) తో చేయించాలని అనుకున్నానని ఇండియాటుడే.ఇన్(India Today)కి ఇచ్చిన ఇంటర్వ్యూ(Interview)లో సందీప్ రెడ్డి వంగా స్వయంగా చెప్పారు. 2011లో అల్లు అర్జున్‌కి ఒక కథను చెప్పాను, కానీ అది సినిమాగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత నేను అర్జున్‌రెడ్డి స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్ కు చెప్పాలనుకున్నాను, కానీ నేను అల్లు అర్జున్ ను ఆ సమయంలో సంప్రదించలేకపోయానని తెలిపారు సందీప్ రెడ్డి. ఆ తర్వాత స్క్రిప్ట్ పలువురు నటీనటులు, నిర్మాతల వద్దకు వెళ్లింది. చివరకు నేనే స్వయంగా సినిమాను నిర్మించాలని భావించాను. తరువాత ఒక స్నేహితుడు ద్వారా విజయ్‌తో పరిచయం అయింది.. విజయ్ కు 'అర్జున్ రెడ్డి' కథ చెప్పి షూటింగ్ ప్రారంభించామని తెలిపారు. అయితే నా మొదటి సినిమాలో అల్లు అర్జున్ హీరోగా కావాలని మాత్రం అనుకున్నానని సందీప్ రెడ్డి చెప్పుకొచ్చారు.
