ది గ్రేట్ ఇండియన్‌ కిచెన్‌(Great Indian Kitchen) సినిమా చూసిన వారెవ్వరూ నిమిషా సజయన్‌ను(Nimisha Sanjay) మర్చిపోలేరు. అంత గొప్పగా ఆమె నటించింది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన నిమిషాది చామన ఛాయే అయినా ఆకర్షించే అందం. ఆమె కళ్లు చాలా చాలా ప్రత్యేక. ఆమె మలయాళీనే అయినా పుట్టింది ముంబాయి నగరంలో.. తైక్వాండోలో జాతీయ స్థాయి క్రీడాకారిణి.

ది గ్రేట్ ఇండియన్‌ కిచెన్‌(Great Indian Kitchen) సినిమా చూసిన వారెవ్వరూ నిమిషా సజయన్‌ను(Nimisha Sanjay) మర్చిపోలేరు. అంత గొప్పగా ఆమె నటించింది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన నిమిషాది చామన ఛాయే అయినా ఆకర్షించే అందం. ఆమె కళ్లు చాలా చాలా ప్రత్యేక. ఆమె మలయాళీనే అయినా పుట్టింది ముంబాయి నగరంలో.. తైక్వాండోలో జాతీయ స్థాయి క్రీడాకారిణి. అద్భుతమైన ప్రతిభ ఆమె సొంతం. దర్శకుడు దిలీష్‌ పోతన్‌ ఆమెను సినిమా రంగానికి పరిచయం చేశాడు. తొండిముతలుమ్‌ ద్రిక్‌సాక్షియమ్‌ సినిమాతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తన టాలెంట్‌తో దక్షిణాది అన్ని భాషల్లోనూ నటిస్తుంది. ఇటీవల జిగర్తాండ డబుల్ ఎక్స్, చిన్నా, నాయట్టు (కోట బొమ్మాళి పీఎస్) వంటి చిత్రాలతో టాలీవుడ్‌ వారికి బాగా దగ్గరైంది.

ఆమె కాస్మెటిక్‌ సర్జరీ(Cosmetic Surgery) చేయించుకున్నదని ఇటీవల ప్రచారం జరుగుతోంది. అందంగా కనిపించడం కోసం ఆ పని చేసిందని మలయాళ పరిశ్రమలో పెద్ద చర్చే జరుగుతోంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదని వారు అంటున్నారు. అయితే కాస్మోటాలజిస్టులు మాత్రం అది తప్పంటున్నారు. డాక్టర్‌ శిఖా చెబుతున్నదేమిటంటే నిమిషా ఎలాంటి కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకోలేదని చెబుతూ నిమిషా ముఖంలో వచ్చిన మార్పులకు కారణాలు తెలిపారు. మునుపటితో పోలిస్తే నిమిషా సజయన్‌ బరువు బాగా తగ్గిందని, రింగులు రింగులుగా ఉన్న తన జుట్టును స్ట్రెయిట్‌ చేయించుకుందని శిఖా చెబుతున్నారు. ఆమె పెదవిలోనూ ఏమీ మార్పులేదని, మొహంలో కూడా ఎలాంటి మార్పూ లేదని డాక్టర్ శిఖా వ్యాఖ్యానించారు. సహజ సౌందర్యం ఉన్న గొప్ప నటి నిమిషా అని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే గత కొన్ని రోజులుగా నిమిషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్ జరుగుతోంది. మలయాళ ప్రముఖ నటుడు సురేష్ గోపి త్రిసూర్ ఎన్నికల్లో విజయం సాధించలేరని ఆమె బహిరంగంగానే వ్యాఖ్యానించింది. మొన్నటి ఎన్నికల్లో సురేశ్‌ గోపీ గెలవడమే కాదు, కేంద్ర మంత్రికూడా అయ్యారు. దీంతో పాత ప్రస్తావన పేరుతో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె సోషల్ మీడియా కామెంట్ బాక్స్‌ను ఆఫ్ చేసింది.

Updated On 9 Jun 2024 11:35 PM GMT
Ehatv

Ehatv

Next Story