ఒక్కో దర్శకుడికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అది మ్యూజిక్ పరంగా కావొచ్చు, కెమెరా పరంగా కావొచ్చు.. చివరాఖరికి హీరోయిన్(Heroine) పరంగా కూడా కావొచ్చు.
ఒక్కో దర్శకుడికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అది మ్యూజిక్ పరంగా కావొచ్చు, కెమెరా పరంగా కావొచ్చు.. చివరాఖరికి హీరోయిన్(Heroine) పరంగా కూడా కావొచ్చు. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్‌పై హీరోయిన్‌లు ప్రదర్శిస్తే .. మళ్లీ మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. రాఘవేంద్రరావుకు శ్రీదేవిలా! దాసరి నారాయణరావుకు జయసుధలా! అంతవరకు ఎందుకు? దర్శక, రచయిత త్రివిక్రమ్(Trivikram) దగ్గరకే వద్దాం.. ఆయన సమంతతో(Samantha) వరుసగా సినిమాలు తీశారు. అసలు సమంత లేని త్రివిక్రమ్ సినిమా ఉండేది కాదు. అత్తారింటికి దారేది సినిమాతో వీరి కాంబినేషన్ మొదలయ్యింది. అత్తారింటికి దారేది సినిమా విజయం సాధించడంతో త్రివిక్రమ్‌కు సమంత సెంటిమెంట్‌గా మారింద. తర్వా సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాల్లో సమంతనే తీసుకున్నారు త్రివిక్రమ్. ఇప్పుడు సమంతను తీసుకోవడం లేదనుకోండి.. మొన్న ఓ సినిమా ఫంక్షన్‌లో సమంత చేయదేమోనన్న భయంతో ఆమె కోసం పాత్రలు రాయడం లేదని త్రివిక్రమ్ చెప్పడం, రాసేయండి అంటూ సమంత సైగ చేయడం మనం చూశాం. రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబోలో సినిమా రావడం గ్యారంటీ. అలాగే బోయపాటి శ్రీను,(Boyapati srinu) ప్రగ్యా జైశ్వాల్(Pragya jaiswal) కూడా! వీరి అనుబంధం కూడా బలపడింది. జయజానకి నాయకలో ప్రగ్యా జైశ్వాల్ చిన్నపాటి పాత్రను వేసింది. తర్వాత ఆమె అఖండలో హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు అఖండ-2లో కూడా ఆమెనే రిపీట్ చేశాడు. అఖండలో(Akhanda) ప్రగ్యా పోషించిన పాత్ర పార్ట్-2లో కూడా కొనసాగబోతోందన్నమాట! అంటే త్రివిక్రమ్‌కు సమంత ఎలా అయ్యారో, బోయపాటికి ప్రగ్య అలాగయ్యారు!