హేమామాలిని మతం మార్చుకున్నారా?
బాలీవుడ్ హీరో ధర్మేంద్ర(dharmendra), డ్రీమ్ గర్ల్ హేమామాలిని(Hema malini) ప్రేమించి పెళ్లి(Love marriage) చేసుకున్నారన్నది తెలిసిన విషయమే! అప్పటికే ధర్మేంద్రకు పెళ్లయి పిల్లలు ఉన్నారు. ప్రకాశ్ కౌర్‌ను(Prakash kaur) పెళ్లి చేసుకున్న ధర్మేంద్రకు నలుగురు సంతానం కలిగారు. సన్నీ డియోల్, బాబీ డియోల్, విజీత డియోల్, అజీత డియోల్. హేమామాలిని ప్రేమలో పడిన తర్వాత ఒకానొక దశలో ప్రకాశ్ కౌర్‌కు విడాకులు ఇద్దామని అనుకన్నారట ధర్మేంద్ర అయితే విడాకుల కోసం కోర్టుకు వెళ్లలేకపోయారు. ప్రకాశ్ కౌర్‌తో విడాకులు తీసుకోకుండానే హేమామాలిని ఎలా పెళ్లి చేసుకోగలిగారన్న అనుమానం చాలా మందికి కలుగుతుంది. రామ్ కమల్ ముఖర్జీ రాసిన హేమామాలిని : బియాండ్ ద డ్రీమ్ గర్ల్ అనే పుస్తకంలో ఈ సందేహాలకు జవాబులు దొరుకుతాయి. ఆయన ఏం రాశారంటే 1979లో ధర్మేంద్ర-హేమామాలినిల నిఖా జరిగింది. ఇందుకోసం వారిద్దరు మతాలు మార్చుకున్నారట! ధర్మేంద్ర తన పేరును దిలావర్‌గా, హేమామాలిని తన పేరును ఆయేషా బీగా మార్చుకున్నారు. అలా ఇస్లామ్‌లో కన్వర్ట్ అయిన తర్వాత ఇద్దరూ బెరుకు లేకుండా పెళ్లి చేసుకున్నారని రామ్ కమల్ ముఖర్జీ చెప్పారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ధర్మేంద్ర బీజేపీ తరఫున పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని లేవనెత్తింది. అఫిడవిట్‌లో కేవలం ప్రకాశ్ కౌర్‌కు చెందిన ఆస్తులను మాత్రమే ప్రస్తావించారు తప్ప హేమామాలిని ఆస్తుల విషయాన్ని చెప్పలేదని కాంగ్రెస్ ఆరోపించింది. అలాగే హేమామాలినిపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలను అని హేమామాలిని కొట్టేశారు.