ఈ మధ్య ఎక్కువగా ఫిల్మ్ సెలబ్రిటీల ఇళ్లలో చోరీలు ఎక్కువగా జరిగుతున్నాయి. అది కూడా ఎక్కువగా ఇంటి దొంగలే ఈ పని చేస్తున్నారు. ఆమధ్య రజనీకాంత్ కూతుళ్ల ఇల్లలో ఇలానే చోరీలు జరగ్గా.. అదిఇంట్లో నమ్మకంగా పనిచేసేవారి పనే అంటే కనిపెట్టారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గారాల చెల్లెలు అర్పితా ఖాన్ ఇంట్లో కూడా ఇలానే దొంగతనం జరిగింది.

సల్మాన్ ఖాన్(Salmaan khan) గారాల చెల్లెలు అర్పితా ఖాన్(Arpita Khan) ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 5 లక్షల విలువైన బంగారం చోరీ జరిగింది. ఈ పని ఇంటిదొంగదే అని కనిపెట్టారు పోలీసులు.

ఈ మధ్య ఎక్కువగా ఫిల్మ్ సెలబ్రిటీల ఇళ్లలో చోరీలు ఎక్కువగా జరిగుతున్నాయి. అది కూడా ఎక్కువగా ఇంటి దొంగలే ఈ పని చేస్తున్నారు. ఆమధ్య రజనీకాంత్ కూతుళ్ల ఇల్లలో ఇలానే చోరీలు జరగ్గా.. అదిఇంట్లో నమ్మకంగా పనిచేసేవారి పనే అంటే కనిపెట్టారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గారాల చెల్లెలు అర్పితా ఖాన్ ఇంట్లో కూడా ఇలానే దొంగతనం జరిగింది. అర్పితకు చెందిన 5 లక్షల విలువ చేసే వజ్రాల చెవి పోగులు దొంగతనం జరిగినట్టు ఆమె పోలీస్ కంప్లైట్ ఇచ్చారు.

తన మేకప్ ట్రేలో పెట్టిన వాజ్రాల చెవిపోగులుపోయాయి అంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. అర్పిత చేసిన ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇది ఇంటిదొంగల పనే అని తేల్చారు. అర్పితా ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అతని నుంచి అసలు నిజం రాబట్టారు. అతని దగ్గర ఆ చెవిపోగులను రికవరీ చేశారు. అతని పేరు సందీప్ హెగ్డే అని.. 30 ఏళ్ల సందీప్.. చాలా కాలంగా అర్పిత ఇంట్లో పనిచేస్తున్నట్టు సమాచారం.

అర్పితా ఖాన్ ఇంట్లో దాదాపుగా 11 మంది పనివారు ఉన్నారు. నిత్యం ఏదో ఒక పనిలో ఉటారు. ఇంట్లో తిరుగుతూనే పనిచేస్తున్నట్టుగా నటించి సందీప్ ఇలా దొంగతనం చేసినట్టుతెలుస్తోంది.దొంగతనం చేసినప్పటి నుంచీ కనిపించడం లేదు. ఎవరికి సమాచారం కూడా ఇవ్వలేదని..దాంతో అతన్ని ట్రేస్ చేసి పట్టుకుని విచారించినట్టు.. ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ మోహన్ మానే తెలిపారు. ఈ క్రమంలో సందీప్ నుంచి చెవి పోగులు రికవరీ చేసి అతనిపై సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.కాగా, సల్మాన్‌ ఖాన్‌కి సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ అనే ఇద్దరు సోదరులు, ఇంకా అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, అర్పితా ఖాన్ అనే ఇద్దరుచెల్లెల్లు ఉన్నారు. అయితే అర్పితా ఖాన్ ను సల్మాన్ ఖాన్ దత్తత తీసుకున్నారు.

Updated On 19 May 2023 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story