ప్రముఖ బాలీవుడ్(Bollywood) దర్శకుడు సంజయ్ గధ్వి(Sanjay Gadhvi) కన్నుమూశారు. ధూమ్(dhoom), ధూమ్ 2(Dhoom 2) సినిమాలతో పాపులర్ అయిన డైరెక్టర్ సంజయ్ గధ్వి ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి గుండెపోటు(Heart Attack) కారణమని వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. దర్శకుడు సంజయ్ గధ్వి అంత్యక్రియలు(Funeral) ఈ రోజు ముంబైలో(Mumbai) జరగనున్నాయి.

ప్రముఖ దర్శకుడు సంజయ్ గధ్వి మృతితో భాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ధూమ్’ ధూమ్ 2 సినిమాల ద్వారా ఆయన ఎంతో పాపులర్ అయ్యారు. హృతిక్ రోష‌న్‌(Hrithik Roshan), అభిషేక్ బ‌చ్చ‌న్(Abhishek Bachchan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ధూమ్ ఫ్రాంచైజీతో సంజ‌య్‌కు విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. మ‌రో మూడు రోజుల్లో 57వ ఏట అడుగుపెట్ట‌నుండ‌గా ఈ విషాదం జ‌ర‌గ‌డంతో ఆయ‌న కుటుంబస‌భ్యులు, బంధుమిత్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు తెల్లవారుజామున మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే సంజయ్ గధ్వి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్దారించారు. సంజ‌య్‌కు భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. ఆయ‌న ఇటీవ‌ల ఫ్రెండ్స్‌తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్‌లో సినిమాలు చూశార‌ని చెబుతున్నారు. బాలీవుడ్‎కు తేరేలియే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. కిడ్నాప్, మేరే యార్‎కి షాదీ హై, అజబ్ గజబ్ లవ్, ధూమ్, ధూమ్ 2, వంటి యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ధూమ్ సిక్వెల్స్ తో ఆయనకు హాలీవుడ్ రేంజ్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దర్శకుడు సంజయ్ గధ్వి సంజ‌య్ మ‌ర‌ణం ప‌ట్ల ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ ప్ర‌గాఢ సంతాపం తెలిపారు.

Updated On 19 Nov 2023 4:54 AM GMT
Ehatv

Ehatv

Next Story