టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani master) మామూలోడు కాదట!
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani master) మామూలోడు కాదట! బాధిత మహిళ పట్ల మృగాడిలాగే వ్యవహరించాడట! పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో జానీ మాస్టర్ వికృత రూపాన్ని వివరించి చెప్పిందామె! బాధిత యువతి పేరు శ్రేష్ట వర్మ(shrasti varma). మధ్యప్రదేశ్‌కు(Madhya Pradesh) చెందిన ఈమెకు డాన్స్ అంటే పిచ్చి ప్రేమ. డాన్స్ కార్యక్రమం ఢీలో విజేతగా నిలిచింది కూడా! ఆ షోకు జానీ మాస్టర్ జడ్జిగా వ్యవహరించేవాడు. ప్రోత్సాహం అందిస్తానంటూ శ్రేష్ట వర్మను నమ్మబలికాడు. తనకు సహయకురాలిగా చేరాలని రిక్వెస్ట్ చేశాడు. పాపం ఇతడిని గుడ్డిగా నమ్మేసిన శ్రేష్ట వర్మ మధ్య ప్రదేశ్‌ను వదిలిపెట్టి హైదరాబాద్‌కు వచ్చేసింది. ముంబాయిలో ప్రోగ్రాం ఉందని చెప్పి ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు జానీ మాస్టర్. అక్కడ ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. సినిమాలలో అవకాశాలు లేకుండా చేస్తానన్నాడు. జానీ బెదిరింపులతో భయపడిపోయిన శ్రేష్ట అతడికి లొంగిపోయింది. తర్వాత అడ్వాంటేజ్‌గా తీసుకున్న జానీ మాస్టర్ తరచూ ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. చివరకు కార్వాన్‌లో కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టేవాడు కాదు. ఒప్పుకోకపోతే దారుణంగా హింసించేవాడు. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బెదిరించేవాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో భార్యను రంగంలోకి దించాడు. తన భర్తను పెళ్లి చేసుకోవాలని జానీ భార్య శ్రేష్టను బెదిరించేది. చేయి కూడా చేసుకునేది. అయినా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. జానీ మాస్టర్ పెడుతున్న హింసను తట్టుకోలేక చివరకు శ్రేష్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.