ఎంతో భవిష్యత్తు ఉన్న కొరియోగ్రాఫర్‌ చైతన్య(Choreographer Chaitanya)ను ఆర్ధిక ఇబ్బందులు మానసికంగా కుంగతీశాయి. అప్పులు భారమయ్యాయి. చావే సమస్యలకు పరిష్కారం అని అనుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. చైతన్యది నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలోని ముత్తంవారిపాళెం. ఇతడి తల్లిదండ్రులు లక్ష్మీరాజ్యం, సుబ్బారావు. ఇతడిని వినీల అనే సోదరి కూడా ఉంది.

ఎంతో భవిష్యత్తు ఉన్న కొరియోగ్రాఫర్‌ చైతన్య(Choreographer Chaitanya)ను ఆర్ధిక ఇబ్బందులు మానసికంగా కుంగతీశాయి. అప్పులు భారమయ్యాయి. చావే సమస్యలకు పరిష్కారం అని అనుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. చైతన్యది నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలోని ముత్తంవారిపాళెం. ఇతడి తల్లిదండ్రులు లక్ష్మీరాజ్యం, సుబ్బారావు. ఇతడిని వినీల అనే సోదరి కూడా ఉంది. ఉపాధి కోసం అయిదేళ్ల కిందట చైతన్య హైదరాబాద్‌కు వచ్చాడు. ఢీ షోలో ఓ గ్రూపుకు కొరియోగ్రాఫర్‌గా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నెల్లూరు నగరంలోని టౌన్‌హాల్లో ఓ ప్రొగ్రామ్‌ కోసం వచ్చాడు. దర్గామిట్లలో ఉన్న నెల్లూరు క్లబ్‌లో రూమ్‌ తీసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో తీసి ఫ్రెండ్స్‌కు పంపాడు. అమ్మా, నాన్న, చెల్లి ఐ లవ్‌యూ. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివ్వలేదు. చెల్లి ఫీల్‌ కావద్దు. నువ్వంటే చాలా ఇష్టం. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కుదరలేదు. అప్పులు అవుతాం. తీర్చుకునే సత్తా ఉండాలి. తీర్చగలను కానీ అంతా తీర్చ లేకపోతున్నా. ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నా. చాలా ప్రయత్నిస్తున్నా. కావట్లేదు. ఢీ పేరు ఇస్తుంది. కానీ సంపాదన తక్కువ ఇస్తుంది. జబర్దస్‌లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ’ అంటూ వీడియో చేసి పంపించాడు చైతన్య. వీడియో చూసిన అతడి ఫ్రెండ్స్‌ ఆందోళన చెందారు. వెంటనే నెల్లూరు పోలీసులకు చెప్పారు. వారు చైతన్య ఉంటున్న గదికి వెళ్లి తలుపుతట్టారు. ఎంతకీ తీయకపోవడంతో కిటికీలోంచి చూశారు. అప్పటికే ఉరేసుకున్నాడు.

చైతన్య మాస్టర్ చనిపోవడాన్ని పరిచయస్థులు తట్టుకోలేకపోతున్నారు. నటి శ్రద్ధాదాస్‌(Shraddha Das) అయితే చైతన్యతో ఉన్న అనుబంధాన్ని చెబుతూ ఎమోషనలయ్యారు.
'పుట్టుక, చావు ఎప్పుడు? ఎందుకు? జరుగుతాయో అంతుచిక్కవు. కానీ జననమరణానికి మధ్యలో మనం ఎలా బతికామన్నదే మనల్ని గొప్పవారిలా చేస్తుంది. నిజంగా చెప్తున్నా.. చైతన్య మాస్టర్‌ చాలా మంచి వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు నవ్వుతూ అందరినీ నవ్వించేవాళ్లు. కానీ ఈరోజు నన్ను ఎంతగానో ఏడిపించారు. మీ స్మైల్‌ నాకెప్పటికీ గుర్తుండిపోతుంది' అని ఇన్‌స్టాగ్రామ్‌ శ్రద్ధాదాస్‌ రాసుకొచ్చారు. అతడితో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను షేర్‌ చేసింది.

శేఖర్‌ మాస్టర్‌(Sekhar Master)అయితే చాలా డిస్ట్రబ్‌ అయ్యారు. నీలాంటి టాలెంటెడ్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ వార్త వినగానే నా గుండె ముక్కలయింది. చాలా డిస్టర్బ్‌ అయ్యాను. నీ చిరునవ్వు ఎన్నటికీ మర్చిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. 'చావు అన్నింటికీ పరిష్కారం కాదు మాస్టర్‌. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని చైతన్యకు నివాళి అర్పిస్తూ యాంకర్‌ రష్మీ అన్నారు.

Updated On 1 May 2023 1:11 AM GMT
Ehatv

Ehatv

Next Story