ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరో ధర్మేంద్ర గురించి ఈ జనరేషన్‌కు అంతగా తెలియకపోవచ్చు కానీ ఆయన ఖాతాలో బ్రహ్మండమైన హిట్స్ ఉన్నాయి. అంతేకాదు 70 ఎంఎం సినిమాలలో అత్యధికం ధర్మేంద్రవే కావడం విశేషం. ఆయన మనవడు కరణ్ డియోల్ పెళ్లి ఘనంగా జరిగింది. దృష ఆచార్యతో కరణ్ ఏడడుగులు నడిచాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరో ధర్మేంద్ర(Dharmendra )గురించి ఈ జనరేషన్‌కు అంతగా తెలియకపోవచ్చు కానీ ఆయన ఖాతాలో బ్రహ్మండమైన హిట్స్ ఉన్నాయి. అంతేకాదు 70 ఎంఎం సినిమాలలో అత్యధికం ధర్మేంద్రవే కావడం విశేషం. ఆయన మనవడు కరణ్ డియోల్(Karan Deol)పెళ్లి ఘనంగా జరిగింది. దృష ఆచార్యతో కరణ్ ఏడడుగులు నడిచాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ పెళ్లికి ధర్మేంద్ర భార్య, కూతుళ్లు రాకపోవడం చర్చనీయాంశమయ్యింది. ధర్మేంద్ర సినీరంగంలో అడుగుపెట్టకముందే, అంఏ 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్‌తో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వారు సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజీత. ఇటీవల పెళ్లి జరిగిన కరణ్ ఎవరంటే సన్నీ డియోల్ కుమారుడు.
ఏడు దశాబ్దాలుగా ధర్మేంద్ర- ప్రకాశ్ కౌర్ కలిసి జీవిస్తున్నారు. అప్పట్లో డ్రీమ్ గర్ల్ అయిన హేమమాలినిపై చాలా మంది హీరోలు మనసు పారేసుకున్నారు. ఆమె మాత్రం ధర్మేంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆల్‌రెడీ ధర్మేంద్రకు పెళ్లి అయ్యిందని తెలిసీ హేమామాలిని ఈ పని చేశారు. వీరిద్దరికి ఈషా, అహానా సంతానం. వీరిని కరణ్ పెళ్లికి రావాల్సిందిగా సన్నీ డియోల్ ఆహ్వానించినా వీరు మాత్రం పెళ్లికి వెళ్లలేదు. పెళ్లిలో హేమమాలిని, ఆమె కూతుళ్లు కనిపించలేదు. ధర్మేంద్ర పిలవకపోవడంతోనే వాళ్లు రాలేదనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా చూసి ధర్మేంద్ర చాలా ఫీలయ్యారు. సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు. 'హేమ.. నా డార్లింగ్ పిల్లు ఇషా, అహానా, అల్లుళ్లు తక్తానీ, వోహ్రా మిమ్మల్ని నేను ఎంతగానో గౌరవిస్తున్నాను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వయసు పైబడటం, అనారోగ్యం నాకో విషయాన్ని గుర్తు చేశాయి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సింది. కానీ..' అంటూ వాక్యాన్ని సగంలోనే ఆపేస్తూ క్షమించండి అన్నట్లుగా చేతులు జోడించిన ఎమోజీని జత చేస్తూ పోస్ట్ పెట్టారు ధర్మేంద్ర..