తమిళ సినీ పరిశ్రమకు(Tamil Industry) చెందిన నలుగురు స్టార్ హీరోలకు అక్కడి నిర్మాతల మండలి(Council of Producers) పెద్ద షాకే ఇచ్చింది. వారికి రెడ్ కార్డు(Red Card) జారీ చేసేందుకు సిద్ధమయ్యింది. హీరోలు ధనుశ్(Dhanush), విశాల్(Vishal), అధర్వ(Atharva), శింబులకు(shimbu) రెడ్ కార్డు ఇవ్వాలని సర్వ సభ్య సమావేశంలో తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి నిర్ణయించింది. నిర్మాత మైఖేల్ రాయప్పతో(Rayappa) వచ్చిన వివాదాల నేపథ్యంలో శింబుకు రెడ్ కార్డు జారీ చేయనున్నారు. ఇప్పటకే ఈ వివాదంపై ఎన్నోసార్లు చర్చలు జరిపినప్పటికీ శింబు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడమే ఈ నిర్ణయానికి కారణం. ఇక హీరో విశాల్ సంగతి మరోలా ఉంది.
తమిళ సినీ పరిశ్రమకు(Tamil Industry) చెందిన నలుగురు స్టార్ హీరోలకు అక్కడి నిర్మాతల మండలి(Council of Producers) పెద్ద షాకే ఇచ్చింది. వారికి రెడ్ కార్డు(Red Card) జారీ చేసేందుకు సిద్ధమయ్యింది. హీరోలు ధనుశ్(Dhanush), విశాల్(Vishal), అధర్వ(Atharva), శింబులకు(shimbu) రెడ్ కార్డు ఇవ్వాలని సర్వ సభ్య సమావేశంలో తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి నిర్ణయించింది. నిర్మాత మైఖేల్ రాయప్పతో(Rayappa) వచ్చిన వివాదాల నేపథ్యంలో శింబుకు రెడ్ కార్డు జారీ చేయనున్నారు. ఇప్పటకే ఈ వివాదంపై ఎన్నోసార్లు చర్చలు జరిపినప్పటికీ శింబు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడమే ఈ నిర్ణయానికి కారణం. ఇక హీరో విశాల్ సంగతి మరోలా ఉంది. ఆయన నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కాలంలో సంఘం సొమ్మును పక్కదారి పట్టించారనే ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆయనకు రెడ్ కార్డు ఇవ్వనున్నారు. మరో హీరో ధనుశ్ ఏమో తెనాందాల్ నిర్మాణ సంస్థలో సినిమాను ముందుగా ఒప్పుకుని, తర్వాత 80 శాతం షూటింగ్ పూర్తయినప్పటికీ షూటింగ్‌కు హాజరు కాకుండా నిర్మాతను వేధించి, నష్టం కలిగించాడు. అలాగే నిర్మాత మథియాజకన్ నిర్మాణ సంస్థతో అథర్వ ఓ చిత్రానికి సైన్ చేశారు. షూటింగ్ మొదలైనప్పటికీ ఆయన సెట్స్‌కు రావడం మానేశారు. ఎన్నిసార్లు సంప్రదించినా స్పందన కరువయయ్యింది. ఈ ఆరోపణలతో యంగ్ హీరో అథర్వకు రెడ్ కార్డ్ ఇవ్వాలని తమిళ సినీ నిర్మాతల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇకపై వీరు ఏ సినిమాల్లోనూ నటించకుండా ఉండటానికి రెడ్ కార్డు ఇస్తారు. మొత్తం మీద పలు కారణాలతో ఈ నలుగురు హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వాలని సినీ నిర్మాతల సంఘం నిర్ణయించింది. వీరితో పాటు నిర్మాతలకు సహకరించని మరికొందరు నటీనటులకు రెడ్ కార్డు ఇవ్వాలని నిర్మాతల సంఘం కొన్ని నెలల కిందట నిర్ణయించింది. ఈ జాబితాలో ఎస్‌జె సూర్య, విజయ్ సేతుపతి, అమలాపాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్‌తో పాటు 14 మంది నటీనటులు ఉన్నారట.