ప్రయోగాలకు పెట్టింది పేరైన తమిళ నటుడు ధనుష్‌(Danush) అప్పుడే హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు.

ప్రయోగాలకు పెట్టింది పేరైన తమిళ నటుడు ధనుష్‌(Danush) అప్పుడే హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం రాయన్‌(raayan) అతడికి 50వ సినిమా కావడం విశేషం. సందీప్‌ కిషన్‌(Sandeep kishan), కాళిదాస్‌ జయరాం(Kalidas jayaram) కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 26వ తేదీన విడుదల కాబోతున్నది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌, ట్రైలర్‌లు వచ్చాయి. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను(Pre release event) నిర్వహించారు మేకర్స్‌. ఈ సందర్భంగా ఆ వేడుకలో ధనుష్‌ అనేక కొత్త విషయాలు చెప్పారు. టాలీవుడ్‌లో(Tollywood) తాను ఎక్కువగా అభిమానించే నటుడు పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) అని అన్నారు. ఐ లవ్‌ సినిమా, ఐ లవ్‌ పవన్‌ కల్యాణ్‌ సర్‌ అని ధనుష్‌ చెప్పగానే ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. ఒక వేళ మల్టీస్టారర్‌ చేయాలంటే ఎవరితో చేస్తారు? అని యాంకర్‌ అడిగారు. మహేశ్‌బాబు(Maheshbabu), జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR), రామ్‌ చరణ్‌(Ram charan), అల్లు అర్జున్‌(allu arjun). వీరిలో ఎవరితో చేస్తారు? అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం ఆలోచించకుండా జూనియర్‌ ఎన్టీఆర్‌ అని సమాధానం ఇచ్చారు. ఈ జవాబుకు కూడా ఆడిటోరియం మారుమోగింది. తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్‌, దుషారా విజయన్‌, సెల్వ రాఘవన్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ధ‌నుష్ ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో కుబేరా అనే సినిమా చేస్తున్నాడు.

Eha Tv

Eha Tv

Next Story