కోలీవుడ్ లో ఇప్పుడో వార్త హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఆ మధ్యన విడాకుల కోసం కోర్టుకు వెళ్ళారు కదా.
కోలీవుడ్ లో ఇప్పుడో వార్త హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఆ మధ్యన విడాకుల కోసం కోర్టుకు వెళ్ళారు కదా. ప్రస్తుతం ఆ మ్యాటర్ కోర్టు లోనే ఉంది. ఇంకా వారికి విడాకులు మంజూరు కాలేదు కానీ విడివిడి గానే ఉంటున్నారు. అయితే ధనుష్, ఐశ్వర్య మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట! రజనీకాంత్ ఇద్దరితో మాట్లాడుతున్నారట. ఇప్పటికే కూతురు మనసు మార్చేసాడట. ఆమెను ఒప్పించాడట. ఇక ధనుష్ ను ఒప్పించడమే తరువాయి. ఇందులో భాగంగా మాజీ అల్లుడు తో కూడా భేటీ అయ్యారట. మొన్న దీపావళికి ధనుష్ ని ఇంటికి పిలిపించుకున్నారు రజనీ. ధనుష్, ఐశ్వర్య ను పక్క పక్కన కూర్చోపెట్టి సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేశారట. ఇందులో ముప్పాతిక శాతం సక్సెస్ అయ్యారని వినికిడి. తన జీవితంలో మిగిలిన ఏకైక కోరిక ఇదేనని వేడు కున్నారట. దీంతో ధనుష్ కొంచెం మెత్త బడ్డరని కోలీవుడ్ లో టాక్.