ఇక తాజాగా పుష్ప(Pushpa) సినిమాకు ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా నేష‌న‌ల్ అవార్డు గెలుచుకున్నాడు దేవిశ్రీప్రసాద్. జాతీయ అవార్డ్ సాధించడంతో.. ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఇక ఫ్యామిలీ కూడా పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ త‌న‌కు సంగీత గురువైనా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilayaraja) ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన పాదాలకు నమస్కరించి.. ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని దేవిశ్రీ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

నేషనల్ అవార్డ్(National Award) రావడంతో దిల్ ఖుష్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ(DSP). ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఆయనకు శుభాకాంక్షలు చెప్పగా.. ..దేవిశ్రీ మాత్రం తన గురువు ఆశీస్సులు(Blessings) తీసుకుకోవడానికి వెళ్ళారు..

ఇక తాజాగా పుష్ప(Pushpa) సినిమాకు ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా నేష‌న‌ల్ అవార్డు గెలుచుకున్నాడు దేవిశ్రీప్రసాద్. జాతీయ అవార్డ్ సాధించడంతో.. ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఇక ఫ్యామిలీ కూడా పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ త‌న‌కు సంగీత గురువైనా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilayaraja) ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన పాదాలకు నమస్కరించి.. ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని దేవిశ్రీ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

ఇళయరాజాను కలుసుకోవడం.. ఆయన ఆశ్సీస్సులు తీసుకోవడానికి సబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో(social Media) వైరల్ అవుతోంది. 2021 సంవత్సరానికిగాను జాతీయ చలనచిత్ర అవార్డులను గురువారం ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈ పురస్కారాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప సినిమాలు వరుస అవార్డ్ లను గెలుచుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి 10 జాతీయ అవార్డ్ లు రాగా.. అందులో ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) ఒక్క సినిమానే ఆరు అవార్డులు సాధించింది. ఇక పుష్ప సినిమా రెండు పురస్కారాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటింది.

అంతే కాదు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన(Uppena) ఎంపిక కాగా.. ఉత్తమ జనరంజక చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌ జాతీయ అవార్డును గెలుచుకుంది. అంతే కాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(Allu Arjun), ఉత్తమ గీతరచయితగా చంద్రబోస్(Chandra Bose),ఉత్తమ క్రిటిక్ గా పురుషోత్తమ్ జాతీయ అవార్డ్ లను సాధించారు. ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డును అలియాభట్‌ గంగూబాయి కతియావాడి సినిమాకు గాను సాధించారు. ఆమెతో పాటు కృతిసనన్‌ సంయుక్తంగా ఈ అవార్డ్ ను గెలుచుకున్నారు. రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్‌ జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని గెలుచుకుంది.

Updated On 26 Aug 2023 11:57 PM GMT
Ehatv

Ehatv

Next Story