ఓ సినిమా విజయవంతం కావడంలో లైట్‌బాయ్ నుంచి దర్శకుడి వరకు అందరి పాత్ర ఉంటుంది. కథ బాగుంటే సరిపోదు. అన్ని మేళవింపులూ ఉండాలి. సంగీతం కూడా చాలా ముఖ్యం. సినిమా పట్ల జనంలో ఆసక్తి పెరగడానికి పాటలు(songs) దోహదపడాయి. కథకు సరిపోయే బ్యాకగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో అవసరం. ఇప్పుడు బీజీల గురించి చాలా మందికి అవగాహన వచ్చింది. అందుకే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పట్ల సంగీత దర్శకులు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఓ సినిమా విజయవంతం కావడంలో లైట్‌బాయ్ నుంచి దర్శకుడి వరకు అందరి పాత్ర ఉంటుంది. కథ బాగుంటే సరిపోదు. అన్ని మేళవింపులూ ఉండాలి. సంగీతం కూడా చాలా ముఖ్యం. సినిమా పట్ల జనంలో ఆసక్తి పెరగడానికి పాటలు(songs) దోహదపడాయి. కథకు సరిపోయే బ్యాకగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో అవసరం. ఇప్పుడు బీజీల గురించి చాలా మందికి అవగాహన వచ్చింది. అందుకే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పట్ల సంగీత దర్శకులు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మధ్యన టాలీవుడ్‌లో(Tollywood) థమన్(Thaman) పేరు చాలా వినిపిస్తోంది. పెద్ద పెద్ద సినిమాలకు థమనే సంగీతం అందిస్తున్నారు. మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా థమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినిమాలకు థమన్ ఇచ్చే మ్యూజిక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అఖండ(Akhanda), వీర సింహారెడ్డి(Veera Simha Reddy) సినిమాలకు బాలయ్య ఎలివేషన్ సీన్లకు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ఆ సినిమాలు విజయవంతమయ్యాయంటే థమన్ మ్యూజిక్ కూడా ఓ కారణం. థమన్ అంటే బాలయ్యకు బాగా ఇష్టం. అందుకే భగవంత్ కేసరి(Bagavanth Kesari) సినిమాకు థమన్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకున్నాడు బాలయ్య.
రెండు రోజుల క్రితం విడుదలైన టీజర్ కు థమన్ అందించిన మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. బాలయ్య సినిమాకు థమన్ కంటే గొప్పగా ఇంకెవరూ సంగీతం అందించలేరేమో అనేంతగా ఇంపాక్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు బాలకృష్ణతో బాబీ(Bobby) చేయబోయే సినిమాకు మాత్రం సంగీత దర్శకుడు మారాడు. ఈసారి దేవిశ్రీప్రసాద్‌ను(DSP) రంగంలోకి దించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన వాల్తేర్ వీరయ్యకు(Valther Veeraiah) దేవిశ్రీప్రసాద్ బ్రహ్మండమైన మ్యూజిక్‌ను ఇచ్చారు. బహుశా ఆ కారణంతోనే దేవిశ్రీప్రసాద్‌వైపు బాబీ మొగ్గుచూపాడేమో! దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే బాలయ్య కూడా వెంటనే ఒకే అనేశారట. పైగా ఇప్పుడు థమన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా బీజిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరేడు సినిమాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా చేయడానికి కాస్త ఎక్కువే టైమ్ పడుతుంది. దేవి శ్రీ ప్రసాద్ ను ఫిక్స్ చేయడానికి బహుశా ఇది కూడా ఓ కారణం కావచ్చు.