ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన దేవర ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్' కూడా ఇటీవలే విడుదలైంది. ఈ పాట సినిమాకు హైప్‌ని పెంచింది.

దేవరకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్‌ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో అభిమానులు ప్రచారం చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశం కోసం పనిచేసిన ఓ వ్యక్తి చెప్పిన ప్రకారం.. వేలాది గ్రామాలకు రక్షకుడిగా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారని.. ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ ఒడ్డున చాలా మందిని చంపుతాడన్నారాయన. అన్ని రికార్డులను ఈ సినిమా బద్దలు కొడుతుందని, సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కచ్చితంగా అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ సినిమాపై హైప్‌ని పెంచుతుంది. మరి కొరటాల శివ అంచనాలను ఎలా అందుకుంటాడో వేచి చూడాలి. దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు చేయనున్నాడు.

Updated On 26 May 2024 9:07 AM GMT
Yagnik

Yagnik

Next Story