యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర సినిమాపై మొదటిరోజు నెగటివ్ ట్రోల్స్ వచ్చాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర సినిమాపై మొదటిరోజు నెగటివ్ ట్రోల్స్ వచ్చాయి. అవి ఎవరు చేశారో అందరికీ తెలుసు. అయితే ఫస్ట్ డే నుంచే కలెక్షన్లను కుమ్మేస్తున్నది. సినిమా వచ్చి పది రోజులైనప్పటికీ కలెక్షన్లు పెద్దగా తగ్గలేదు. రిలీజ్ టైమ్ లో తొలగించిన సాంగ్, కొన్ని సీన్స్‌ను మళ్లీ జత చేయడంతో మంచి థియేటర్లు ఫుల్లవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల హక్కులను నాగ వంశీ కొన్నారు. సితార్ ఎంటర్టైన్మెంట్స్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లతో అన్ని ఏరియాల కలిపి 112.50 కోట్ల రూపాయల లక్ష్యంతో వచ్చిన దేవర(Devara) పది రోజుల్లోనే 135.83 కోట్లు వసూలు చేసింది. అంటే దేవరను కొన్న ప్రతి ఒక్కరు లాభాలను గడించారు. నార్త్ బెల్ట్‌లోనూ దేవర దుమ్ము రేపుతోంది. ఆల్‌రెడీ లాభాలను ఆర్జించింది. ఓవర్సీస్‌లో అయితే రికార్డులు కొల్లగొట్టింది. లాంగ్ రన్‌లో అమెరికా(America)లో ఏడు విలియన్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనాల్సిన అవసరం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. దరిదాపులలో పెద్ద హీరోలు నటించిన సినిమాలేవీ లేకపోవడంతో దసరా సీజన్లో దేవరకు తిరుగే ఉండదనిపిస్తోంది. మొత్తం మీద మొదటి పది రోజులకు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి.