ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) తర్వాత ఎన్టీఆర్‌కు(NTR) చాలా గ్యాప్‌ వచ్చింది. లాస్టియర్ ట్రిపులార్‌ సినిమా విడుదలయ్యింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ సినిమా ఒక్కటి కూడా లేదు. ప్రస్తుతం కొరటాల శివ(Koratala) దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేస్తున్నారు. దీనికి దేవర(Devara) అనే పేరు పెట్టారు.

ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) తర్వాత ఎన్టీఆర్‌కు(NTR) చాలా గ్యాప్‌ వచ్చింది. లాస్టియర్ ట్రిపులార్‌ సినిమా విడుదలయ్యింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ సినిమా ఒక్కటి కూడా లేదు. ప్రస్తుతం కొరటాల శివ(Koratala) దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేస్తున్నారు. దీనికి దేవర(Devara) అనే పేరు పెట్టారు. జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan) ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో తీర్చిదిద్దుతున్న భారీ సెట్‌లో ఫైటింగ్‌ సీన్లను తెరకెక్కించబోతున్నారు.

ఎన్టీఆర్‌-సైఫ్‌అలీఖాన్‌ మధ్య వచ్చే ఈ యాక్షన్‌(Action) ఎపిసోడ్‌ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందట! ఎన్టీఆర్‌ బర్త్‌డేను పురస్కరించుకుని మే 20వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మృగాల్లాంటి మనుషుల బారి నుంచి తన వారిని రక్షించుకునే ధీరోదాత్తుడైన వ్యక్తిగా ఎన్టీఆర్‌ ఇందులో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ పాత్రను అత్యంత శక్తివంతంగా మలిచారు కొరటల శివ. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Updated On 20 Jun 2023 6:55 AM GMT
Ehatv

Ehatv

Next Story