యూ ట్యూబ్ స్టార్, బిగ్‌బాస్(Bigg Boss) ఫేమ్ దేత్తడి హారిక(Dettadi Harika) అలియాస్ అలేఖ్య హారికకు(Alekhya Harika) పరిచయం అక్కర్లేదు. దేత్తడి అనే యూ ట్యూబ్ ఛానెల్‌తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. తెలంగాణ యాసతో మాట్లాడుతూ ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. ఈ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఆఫర్ అందుకున్నారు.

Dettadi Harika
యూ ట్యూబ్ స్టార్, బిగ్‌బాస్(Bigg Boss) ఫేమ్ దేత్తడి హారిక(Dettadi Harika) అలియాస్ అలేఖ్య హారికకు(Alekhya Harika) పరిచయం అక్కర్లేదు. దేత్తడి అనే యూ ట్యూబ్ ఛానెల్‌తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. తెలంగాణ యాసతో మాట్లాడుతూ ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. ఈ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఆఫర్ అందుకున్నారు. తన చురుకుదనంతో టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. బిగ్‌బాస్ తర్వాత హారిక చాలా షోలలో పాల్గొన్నారు. కానీ కొంత కాలంగా ఆమె బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు. లేటెస్ట్ కబురేమిటంటే త్వరలో అలేఖ్య హారిక హీరోయిన్(Heroine) కాబోతున్నారట! అలాగని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది. చిన్న సినిమాలకు బెస్ట్ ఆప్షన్‌గా ఉన్న యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh shobhan) హీరోగా నటిస్తున్న సినిమాలో అలేఖ్య హారిక కథానాయికగా నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను బేబీ వంటి సూపర్‌హిట్‌ను అందించిన నిర్మాత ఎస్‌కెఎన్(SKN), డైరెక్టర్ సాయి రాజేశ్‌ను(Sai Rajeshan) కలిసి నిర్మిస్తున్నారని అంటున్నారు. బేబీ సినిమాలో యూ ట్యూబర్ వైష్ణవి చైతన్యకు(Vaishnavi chaithanya) అవకాశం ఇచ్చిన సాయి రాజేశ్ ఇప్పుడు మరో యూట్యూబర్ హారికను హీరోయిన్ చేస్తున్నారు.తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాను తెరకెక్కించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి అయ్యాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దేత్తడి హారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ వీడియోలు, హాట్‌హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటారు.
