నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash raj) చేసిన ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(Pawan kalyan) కాస్త ఆలస్యమైనా స్పందించారు
నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash raj) చేసిన ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(Pawan kalyan) కాస్త ఆలస్యమైనా స్పందించారు. తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదం నేపథ్యలో ప్రకాశ్‌రాజ్ ఓ ట్వీట్ చేయడం, ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నపవన్ కౌంటర్ ఇవ్వడం తెలిసిన విషయాలే! తనపై పవన్ చేసిన వ్యాఖ్యలకు విదేశాల్లో ఉన్న ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. తన కామెంట్‌ను పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని పోస్ట్ పెట్టారు. ఇప్పుడు దానికి పవన్ రియాక్టయ్యారు. 'ప్రకాశ్‌రాజ్ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. నటుడిగా ఆయన్ని గౌరవిస్తా. ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ఇష్టం. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో పోస్ట్ పెట్టా. ఢిల్లీలో(Delhi) మీ స్నేహితులంటూ ఆయన ఆవిధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పోస్ట్ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది’ అని పవన్ చెప్పుకొచ్చారు.