నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో బాధ్యుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో వారు బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని అనుమానంపై అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి సోషల్ మీడియా ఖాతా నుంచే ఆ వీడియో అప్‌లోడ్ అయినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. తర్వాత ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో బాధ్యుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో వారు బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని అనుమానంపై అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి సోషల్ మీడియా ఖాతా నుంచే ఆ వీడియో అప్‌లోడ్ అయినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. తర్వాత ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువకుడికి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఆ యువకుడిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేయలేదు. తాను వేరే ఇన్‌స్టా ఖాతా నుంచి ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసుకున్నానని విచారణ సందర్భంగా ఆ యువకుడు తెలిపాడు. అయినప్పటికీ విచారణ కొనసాగుతుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మొబైల్ ఫోన్‌తో పాటు బీహార్‌కు చెందిన యువకుడిని ఐఎఫ్‌ఎస్‌ఓ యూనిట్ ఎదుట హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. అలాగే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే, IFSO యూనిట్ కూడా నిందితుడిని గుర్తించడానికి URL ఇతర వివరాల కోసం సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు లేఖ రాసింది. రష్మిక డీప్ ఫేక్ వీడియో ఆన్‌లైన్‌లో మహిళల సెక్యూరిటీపై కలవరం కలిగించింది. చాలా మంది ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.