మొన్నామధ్య వచ్చిన షారూక్ ఖాన్(shah Rukh Khan) సినిమా పఠాన్(Pathan) గుర్తుండే ఉంటుంది. అందులో బేషరమ్ పాటలో బికినీ అందాలతో దీపికా పడుకొనే(Deepika padukone) చేసిన హంగామా కూడా గుర్తుండే ఉంటుంది. ఆ పాట యూ ట్యూబ్‌లో అలా విడుదలయ్యిందో లేదో మిలియన్‌లలో వ్యూస్ వచ్చాయి. ఆ పాటపై వివాదాలు కూడా చెలరేగాయి. కాషాయం రంగుపై బీజేపీ, దాని అనుబంధ సంస్థలు నానా రచ్చ చేశాయి.
మొన్నామధ్య వచ్చిన షారూక్ ఖాన్(shah Rukh Khan) సినిమా పఠాన్(Pathan) గుర్తుండే ఉంటుంది. అందులో బేషరమ్ పాటలో బికినీ అందాలతో దీపికా పడుకొనే(Deepika padukone) చేసిన హంగామా కూడా గుర్తుండే ఉంటుంది. ఆ పాట యూ ట్యూబ్‌లో అలా విడుదలయ్యిందో లేదో మిలియన్‌లలో వ్యూస్ వచ్చాయి. ఆ పాటపై వివాదాలు కూడా చెలరేగాయి. కాషాయం రంగుపై బీజేపీ, దాని అనుబంధ సంస్థలు నానా రచ్చ చేశాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో దీపికా పడుకొనే గురించే చర్చ జరిగింది. చివరాఖరికి దీపికా ముస్లిం అనే వాట్సప్ యూనివర్సిటీ మేథావులు కూడా పుట్టుకొచ్చారు. నిజానికి పఠాన్ సినిమాకు అంత హైప్ రావడానికి బేషరమ్ పాట కూడా ప్రధాన పాత్ర పోషించింది. నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో దీపికా బికినీలో దర్శనమిచ్చి కుర్రకారుకు నిద్రపట్టని రాత్రుళ్లను మిగిల్చింది. ఇక ఇప్పుడు మరోసారి బికినీలో(Bikini) దర్శనమిచ్చి యూత్ మతి పోగొడుతున్నది దీపిక.
లేటెస్ట్‌గా దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లోInstgram) బ్లాక్ కలర్ బికినీ వేసుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. వన్స్ ఎపాన్ టైమ్.. నాట్ లాంగ్ ఎగో అనే క్యాప్షన్‌ను ఆ ఫోటోకు జత చేసింది. దీనిపై దీపికా పడుకొనే భర్త రణవీర్ సింగ్(Ranveer singh) ముందే ఓ వార్నింగ్ ఇచ్చి ఉంటే బాగుండేదంటూ కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఆ బికినీ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ది హాటెస్ట్ ఫైర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నటి బిపాసా బసు కూడా ఫైర్ అనే ఎమోజీ పెట్టింది. ప్రస్తుతం దీపికా పడుకొనే రెండు సినిమాల్లో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తీస్తున్న ప్రాజెక్ట్ కల్కీలో దీపికా హీరోయిన్‌గా నటిస్తున్నది. దాంతో పాటు ఫైటర్ అనే సినిమా చేస్తున్నది. ఇక షారూక్‌ఖాన్ నటించిన జవాన్‌లో అతిథి పాత్రలో కనిపించబోతున్నది. ఇప్పటికే రిలీజైన జవాన్ టీజర్‌లో ఓ రెండు సెకన్ల పాటు దీపిక కనిపించి అభిమానులకు అనూహ్య కానుకను ఇచ్చింది. ఇందులో దీపిక పాత్ర ఏమై ఉంటుందా అనే ఆసక్తిని పెంచింది.