సినిమా ఇండస్ట్రీలో వదంతులు ఇట్టే వ్యాపిస్తాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు అక్కడే ఎక్కువగా ఉంటారు. సినిమావాళ్లకు సంబంధించిన ఎలాంటి వార్త ఆసక్తిగానే ఉంటుంది. అందుకే రూమర్స్‌ను స్ప్రెడ్‌ చేస్తుంటారు కొందరు. ఇప్పుడు బాలీవుడ్‌లో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్న రణ్‌వీర్‌సింగ్‌(Ranveer Singh)-దీపికా పడుకోనె(Deepika Padukone) మీద పడ్డారు. ఇద్దరికీ ఇండస్ట్రీలో బోల్డంత క్రేజ్‌ ఉంది.

సినిమా ఇండస్ట్రీలో వదంతులు ఇట్టే వ్యాపిస్తాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు అక్కడే ఎక్కువగా ఉంటారు. సినిమావాళ్లకు సంబంధించిన ఎలాంటి వార్త ఆసక్తిగానే ఉంటుంది. అందుకే రూమర్స్‌ను స్ప్రెడ్‌ చేస్తుంటారు కొందరు. ఇప్పుడు బాలీవుడ్‌లో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్న రణ్‌వీర్‌సింగ్‌(Ranveer Singh)-దీపికా పడుకోనె(Deepika Padukone) మీద పడ్డారు. ఇద్దరికీ ఇండస్ట్రీలో బోల్డంత క్రేజ్‌ ఉంది. పలు భారీ చిత్రాలలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికాన్ని(Remuneration) తీసుకుంటున్నది దీపికా పడుకొనెనే! అయితే వీరి వైవాహిక బంధంపై గత కొంతకాలంగా రూమర్స్‌ వినిపిస్తున్నాయి. మనస్పర్థల కారణంగా ఈ దంపతులు విడిపోనున్నారని ముంబాయి మీడియాలో కథనాలొచ్చాయి. అయితే కొద్ది నెలల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రకమైన వదంతులపై దీపికా పడుకొనె రియాక్టయ్యారు.

రణ్‌వీర్‌తో తాను ఆనందమయ జీవితాన్ని సాగిస్తున్నానని అన్నారు. దీపిక అంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ దంపతుల విడాకులపై వదంతులు ఆగడం లేదు. ఇలాంటి వార్తలన్నింటికీ చెక్‌ పెడుతూ తన ఇన్‌స్టాగ్రామ్ల(instagram) ఓ ఫోటోను పోస్ట్‌ చేశారు దీపికా పడుకొనె! ఇందులో భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి ఆనందంగా పడవలో విహరిస్తూ కనిపిస్తుంది దీపిక. రణ్‌వీర్‌సింగ్‌ కూడా ఇదే ఫొటోను తన సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. విడాకుల వదంతులకు చెక్‌ పెట్టేందుకే ఈ దంపతులిద్దరూ ఈ ఫొటోను షేర్‌ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీపికా ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌-కె’ ‘ఫైటర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Updated On 11 July 2023 7:27 AM GMT
Ehatv

Ehatv

Next Story