Deepika Padukone : నడక మార్గంలో తిరుమలకు దీపికా పదుకొనె..!
తిరుమల(tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనకోసం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె(Deepika padukone) తిరుమలకు వచ్చారు. ఈనెల 14న రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ ఆమె తిరుమలకు చేరుకున్నారు. దాదాపు మూడున్నరగంటలపాటు ఆమె మెట్లమార్గం ద్వారా నడిచారు. ఆమె వెంట వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. శ్రీవారి గోవింద నామస్మరణ చేస్తూ అలిపిరి(Alipiri) నడక మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు.

Deepika Padukone
తిరుమల(tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనకోసం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె(Deepika padukone) తిరుమలకు వచ్చారు. ఈనెల 14న రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ ఆమె తిరుమలకు చేరుకున్నారు. దాదాపు మూడున్నరగంటలపాటు ఆమె మెట్లమార్గం ద్వారా నడిచారు. ఆమె వెంట వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. శ్రీవారి గోవింద నామస్మరణ చేస్తూ అలిపిరి(Alipiri) నడక మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. దీపికాను చూసిన భక్తులు ఒక్కసారికి ఆశ్చర్యపోయారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ బాలీవుడ్ నటిని చూసిన భక్తులు ఆమెతో సెల్ఫీల కోసం ప్రయత్నించడంతో దీపికా రక్షణ సిబ్బంది భక్తులను వారించారు. సామాన్య భక్తులతో కలిసి దీపికా కొండపైకి ముందుకు వెళ్లారు. తిరుమలలోని రాధేయం గెస్ట్‌హౌస్‌లో(Guest House) గురువారం రాత్రి బస చేసిన దీపికా ఈరోజు ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వీఐపీ విరామ సమయంలో(VIP break darshan) స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దీపికా ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
