బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెతో(Deepika padukone) కలిసి నటించాలని ఎవరికి మాత్రం ఉండదు.. అగ్రకథనాయకులే ఆమె కాల్షీట్ల కోసం ఎదురుచూస్తుంటారు. షారూక్‌ఖాన్‌తో(Shahruk khan) కలిసి నటించిన పఠాన్(Pathan) సినిమా బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. ఈ విజయంలో దీపిక పాత్ర కూడా ఎంతో ఉంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెతో(Deepika padukone) కలిసి నటించాలని ఎవరికి మాత్రం ఉండదు.. అగ్రకథనాయకులే ఆమె కాల్షీట్ల కోసం ఎదురుచూస్తుంటారు. షారూక్‌ఖాన్‌తో(Shahruk khan) కలిసి నటించిన పఠాన్(Pathan) సినిమా బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. ఈ విజయంలో దీపిక పాత్ర కూడా ఎంతో ఉంది. గ్లామర్‌తో యువకుల మతిపోగొట్టిన దీపిక గతంలో రజనీకాంత్‌కు జోడిగా కోచ్చడాయన్‌(Kochadayan) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శింబు(shimbu) సినిమాలో ఆమెను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శింబు నటించిన కొత్త సినిమా పత్తుతల అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు శింబు నటిస్తున్న 48వ చిత్రాన్ని కమల్‌హాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ బ్యానర్‌లో నిర్మిస్తుండటం విశేషం.

ఈ చిత్రాన్ని కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్‌లైయడిత్తాల్‌ డైరెక్టర్‌ దేసింగ్‌ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణెను తీసుకోవాలనుకున్నారు. శింబు చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించింది కూడా! నటించడానికి ఓకే చెప్పిన దీపిక 30 కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్‌ చేసిందట. అంతేనా... తాను షూటింగ్‌కు వస్తే ఫైవ్‌స్టార్‌ హోటల్లో బసచేస్తానని, ఆ హోటల్లో తాను బస చేసే అంతస్తు మొత్తం తనకే కేటాయించాలని కండిషన్‌ పెట్టిందట! ఈ డిమాండ్లన్ని విన్న చిత్ర యూనిట్‌కు దిమ్మదిరిగింది. దీపిక డిమాండ్‌ చేసిన రెమ్యునరేషన్‌ లేడి సూపర్‌స్టార్‌ నయనతార పారితోషికం కంటే మూడు రెట్లు! ఇప్పుడు మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే ప్రయత్నంలో శింబు చిత్ర యూనిట్‌ ఉందట.

Updated On 18 May 2023 4:10 AM GMT
Ehatv

Ehatv

Next Story