అభిషేక్ బచ్చన్(Abhishek bachchan), ఐశ్వర్య రాయ్(aishwarya rai) వివాహమే పెద్ద సంచలనం.
అభిషేక్ బచ్చన్(Abhishek bachchan), ఐశ్వర్య రాయ్(aishwarya rai) వివాహమే పెద్ద సంచలనం. అసలు వీరిద్దరికి పెళ్లి అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. వీరి వివాహబంధం ఇంతకాలం సజావుగా సాగింది. మున్ముందు కూడా వీరి కాపురం హాయిగా ఉండాలన్నదే అందరి కోరిక. కాకపోతే మధ్య మధ్యలో వస్తున్న వీరి విడాకుల(divorce) వార్తనే వారి అభిమానులకు కొంచెం కలవరపెడుతున్నది. వీరి విడాకులపై వదంతులు రావడం ఇదేం మొదటిసారి కాదు. ఏడాది కాలంగా విడాకులపై వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్‌గా వీళ్లిద్దరి మధ్య ఏఐ వీడియోలు కూడా ప్రత్యక్షమయ్యాయి.
ఐశ్వర్యరాయ్ తో విడిపోయినట్టు, విడాకులు తీసుకున్నట్టు అభిషేక్ బచ్చన్ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియో ఒరిజినల్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించి డీప్ ఫేక్ చేశారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ తో విడాకులు తీసుకున్న విషయాన్ని చెబుతున్నట్టు మార్ఫింగ్ చేశారు. అయితే ఇది నిజం కాదన్న విషయం నెటిజన్లకు ఇట్టే తెలిసిపోయింది. అందుకే నవ్వి ఊరుకుంటున్నారు తప్ప సీరియస్‌గా తీసుకోవడం లేదు. అభిషేక్ బచ్చన్ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కనీసం సైబర్ వారికి కంప్లయింట్ కూడా చేయలేదు.
ఇదిలాఉంటే ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మధ్యలో ఓ డాక్టర్ వచ్చాడు. జిరాక్ మార్కర్ అనే ఈ డాక్టర్ కారణంగానే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్నది ఓ టాక్. వీరి కాపురంలో ఈ డాక్టరే చిచ్చు పెట్టాడని అంటున్నారు. జిరాక్ మార్కర్, ఐశ్వర్యరాయ్‌లు మంచి స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని, అందుకే బచ్చన్ కుటుంబం ఐశ్వర్యకు దూరంగా ఉంటున్నదని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ముఖేశ్ అంబానీ కుమారుడి పెళ్లికి కూడా బచ్చన్ కుటుంబం సపరేటుగా, ఐశ్వర్య రాయ్ సపరేటుగా వచ్చారు. దీంతో అభిషేక్-ఐశ్వర్య విడిపోతున్నారన్నదానికి కొంచెం బలం చేకూరింది.