దసరా(Dasara) సినిమాతో ఫస్ట్ మూవీనే హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదేల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి ఈవెంట్లో టాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు.
కరీంనగర్‌(Karimnagar) నగరంలో డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల వివాహ వేడుక ఘనంగా జరిగింది.వెడ్డింగ్‌ ఈవెంట్‌ (wedding)కు ఫిలిం ఇండస్ట్రీ నుంచి దర్శకుడు సుకుమార్‌(Sukumar), జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌ కేవీతోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.

దసరా(Dasara) సినిమాతో ఫస్ట్ మూవీనే హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదేల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి ఈవెంట్లో టాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు.

దసరా (Dasara) సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. ఎంట్రీతోనే సూపర్ హిట్టు కొట్టిన ర్ శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) ఇండస్ట్రీలో అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు చాలా కాలంగా హిట్ కోసంఎదురుచూస్తున్న నానికి సూపర్ హిట్ అందించాడు శ్రీకాంత్. ఇక శ్రీకాంత్‌ ఓదెల తన పర్సనల్ లైఫ్ లో ఓ కొత్త పేజ్ ను ఓపెన్ చేశాడు. తన బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు గుడ్‌ బై చెప్పి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాడు.

కరీంనగర్‌(Karimnagar) నగరంలో డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల వివాహ వేడుక ఘనంగా జరిగింది.వెడ్డింగ్‌ ఈవెంట్‌ (wedding)కు ఫిలిం ఇండస్ట్రీ నుంచి దర్శకుడు సుకుమార్‌(Sukumar), జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌ కేవీతోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. అయితే నాని(Nani) వెడ్డింగ్‌ ఈవెంట్‌కు హాజరుకాలేకపోయాడు. పూణేలో(Pune) ఓ యాడ్‌ ఫిల్మ్‌(ADV Film) షూటింగ్ కారణంగా వెడ్డింగ్‌కు రాలేకపోయినట్టు సమాచారం. అయితే ఓ వీడియో సందేశంతో నాని శ్రీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంతో తెలంగాణలో సింగరేణి బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కింది దసరా సినిమా . వీర్లపల్లి గ్రామంలో జరిగే కథ నేపథ్యంలో తెరకెక్కించిన దసరా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వాన కురిపించింది. ఈ సినిమా సక్సెస్‌తో స్టార్ ప్రొడ్య‌సర్ల చూపు శ్రీకాంత్ వైపు పడింది. అయితే ఇంత వరకూ ఈ డైరెక్టర్ కొత్త సినిమా ప్రకటించలేదు. శ్రీకాంత్‌ ఓదెల ప్రస్తుతం ఓ టాప్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్టు టాక్.

Updated On 1 Jun 2023 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story