ప్రభాస్(Prabhas) హీరోగా.. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక సినిమాలు.. బాహుబలి-1, బాహుబలి-2. టాలీవుడ్ లో ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సినిమాలు ఇవి. ఈరెండు సినిమాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు పార్టులు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పాయి. అయితే, కొన్నాళ్లుగా బాహుబలి-3 ఉండొచ్చన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

తాజాగా బాహుబలి3(Bahubali3)పై ప్రభాస్ గట్టిగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన .. బాహుబలి నిర్మాతలతో సమావేశం అవ్వడంతో ఈ న్యూస్ కు బలం చేకూరింది. బాహుబలి3 ప్రచారానికి మరింత హైప్ తీసుకువస్తోంది. బాహుబలి-3పై చర్చించేందుకే ప్రభాస్ ఆ నిర్మాతలను కలిసారంటూ వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం బాహుబలి 3 సాధ్యం అ వుతందా లేదా అతని ఎవరికి వారు అంచనా వేస్తున్నారు. అసలు బాహుబలి మూడోవ సీక్వెల్ పై గతంలోనే మాటలు విపిపించాయి.

అప్పట్లో బాహుబలి సిరీస్ కొనసాగింపుపై ప్రభాస్ స్పందిస్తూ... తగిన సమయం వస్తే ఏదైనా జరగొచ్చని చెప్పి.. ఫ్యాన్స్ కు లేనిపోని ఆశలు కల్పించారు. దాంతో తాజాగా ఈసినిమాపై వరుస వార్తలు వస్తున్న క్రమంలో.. ప్రభాస్ బాహుబలి నిర్మాతలను కలవడంతో ఆ కామెంట్స్ కు బలం చేకూరినట్టయింది. బాహుబలి నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ దేవినేని కూడా గతంలో ప్రభాస్ లాగానే బాహబలి3 పై హింట్ ఇచ్చాడు. అయితే అది ఎప్పుడు వస్తుందన్నది క్లారిటీ లేదని అన్నారు.

అయితే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితి లేదు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ బాబు సినిమా సన్నాహాలలో ఉన్నాడు. అది ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేము. అసలే పాన్ వరల్డ్ మూవీగా.. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈసినిమాతో హాలీవుడ్ ను టార్గెట్ చేశాడు జక్కన్న. దాంతో బాహుబలి3పై ఇప్పట్లో వర్కౌట్ చేసే అవకాశం లేదంటున్నారు.

అటు ప్రభాస్ కూడా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తి అయ్యే సరికి ఏన్నేళ్ళు అవుతుందో తెలియదు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, రాజా డీలక్స్, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు.అవన్నీ అయిపోయాక అప్పుడు ఆలోచిస్తామని తెలిపారు. కాగా, బాహుబలి తొలి రెండు పార్టుల కంటే మూడో పార్టులో కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందన్న వార్తలు బయటికి వస్తున్నాయి. ఏదేమైనా, దీనిపై బాహుబలి టీమ్ అధికారిక ప్రకటన చేస్తేనే స్పష్టత వస్తుంది.

Updated On 23 April 2023 10:06 PM GMT
Ehatv

Ehatv

Next Story