ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా ఇవాళ థియేటర్లలో వచ్చింది. సినిమా అభిమానులకు పసందైన విందును అందించింది. చూసిన వారంతా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ(Kalki 2898AD) సినిమా ఇవాళ థియేటర్లలో వచ్చింది. సినిమా అభిమానులకు పసందైన విందును అందించింది. చూసిన వారంతా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో నటించిన కల్కి సినిమా(Kalki Movie)కు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ సంస్థ సినిమాను నిర్మించింది. పురాణాల గురించి దేవుని అవతారాల గురించి వర్ణిస్తూ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలో అందరూ గొప్పగా నటించారు. సైంటిఫిక్ ఫిక్షన్కు మైథిలాజికల్ టచ్ ఇస్తూ తీసిన ఈ సినిమా అన్నవర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గొప్పగా ఉంది. చివరి అరగంట సినిమా అయితే అద్భుతమనే చెప్పాలి. భైరవ(Bhairava)గా ప్రభాస్‌ను నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపించాడు. మొదటి 20 నిమిషాల సినిమా మామూలుగా ఉన్నా, ఆ తర్వాత ఊపిరి బిగబట్టి చూసేలా సినిమా ఉంది. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) యాక్షన్స్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కమలహాసన్(Kamalhassan) గెటప్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దుల్కర్ సల్మాన్(Dulkar Salman), టాలీవుడ్ దర్శకులు రాజమౌళి(Rajamouli), రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) కూడా గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారు.బొమ్మ అదిరిపోయింది... అన్ని రికార్డులు తిరగరాయడం ఖాయం!