కోలీవుడ్ నటుడు ధనుష్(Dhanush)-నయనతార(Nayanthara) మధ్య గొడవ ఇప్పటిదేం కాదు.
కోలీవుడ్ నటుడు ధనుష్(Dhanush)-నయనతార(Nayanthara) మధ్య గొడవ ఇప్పటిదేం కాదు. పదేళ్ల కిందటే వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. ఆ గొడవ ఇంతకాలం ముదిరి ఇప్పుడు పాకాన పడిందంతే! ధనుష్‌పై కోపంతో నయనతార ఒక బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే! నయనతారపై నెట్‌ఫ్లిక్స్(Netflix) తీసిన ఓ డాక్యుమెంటరీ కారణంగా ఇద్దరి మధ్య గొడవ పది మందికి తెలిసివచ్చింది. తన డాక్యుమెంటరరీని(Documentry) అడ్డుకునేందుకు ధనుష్ ప్రయత్నించాడని, రెండేళ్లుగా ఎన్‌ఓసీ(NOC) ఇవ్వకుండా సతాయించాడని నయనతార ఆరోపించారు. నానుమ్ రౌడీదాన్(Nanum rowdy dhan) సినిమాకు సంబంధించిన మూడు సెకన్ల క్లిప్పింగ్‌ను వాడుకున్నందుకు పది కోట్లు డిమాండ్ చేశాడు ధనుష్. ఇక్కడే ధనుష్ పాతాళానికి దిగజారడని, అతడి క్యారెక్టర్ ఏమటో తెలిసిపోయిందని నయనతార ఘాటుగా విమర్శించారు.
పదేళ్ల కిందట విఘ్నేశ్ శివన్(Vignesh shivan) దర్శకత్వంలో నానుమ్ రౌడీదాన్ సినిమాను ధనుష్ నిర్మించాడు. ఇందులో విజయ్ సేతుపతి(Vijay sethupathi) హీరోగా నటించాడు. ఈ సినిమా సమయంలోనే నయనతారకు విఘ్నేశ్ దగ్గరయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ వ్యవహారం ధనుష్‌కు నచ్చలేదు. వారిద్దరు ప్రేమించుకోవడం కోసం నేను డబ్బులు పె్టి సినిమా తీయాలా అన్నది ధనుష్ భావన. అప్పటికే అనుకున్నదాని కంటే బడ్జెట్ పెరిగిపోయింది. ఆ అసహనంతో ధనుష్ ఆ మాట అని ఉంటాడేమో! అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువ కావడంతో ఓ దశలో ధనుష్ సినిమా షూటింగ్ ఆపేశాడు. అప్పటికే విఘ్నేశ్‌తో ప్రేమలో ఉన్న నయనతార తను ఫైనాన్స్ చేసి సినిమాను పూర్తి చేశారని అంటారు. మరోవైపు సినిమాలో నయనతార నటనపై ధనుష్ చాలా కామెంట్లు చేశాడట! ఆమె నటన అసలు బాగోలేదని, సినిమాను వృధా చేస్తున్నదని చాలామందితో చెప్పాడట! చిత్రమేమింటే ఈ సినిమాలో నటనకు గాను నయనతారకు ఉత్తమ నటి అవార్డు(Best actress award) రావడం. ఆ అవార్డు ఫంక్షన్‌కు ధనుష్ కూడా వచ్చాడు. అవార్డు అందుకుంటూ నయనతార డైరెక్ట్‌గానే ధనుష్‌పై సెటైర్లు వేశారు. తన నటన నిర్మాతకు నచ్చలేదని, నెక్ట్స్ టైమ్ బాగా నటిస్తానని స్టేజ్‌పైనే చెప్పింది. ధనుష్ ఇగో హర్ట్ కావడానికి ఇది కూడా కారణం. నయనతార రాసిన బహిరంగ లేఖలో ఈ ప్రస్తావన కూడా ఉంది. 'నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన, ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సినిమా గురించి మీరు చెప్పిన భయంకరమైన విషయాలను మరచిపోలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీరు చేసిన వ్యాఖ్యలు మాకు మానిపోని గాయాన్ని మిగిల్చాయి. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత మీ అహం బాగా దెబ్బతిందని సినీవర్గాల నుంచి తెలుసుకున్నా. ప్రజలు ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడరని నమ్ముతున్నా. ఈ లేఖతో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి' అని నయన్ రాశారు. అంటే ధనుష్ అప్పడు బాగాఅసూయ చెందాడని అనుకోవాలి. అయితే ధనుష్ వైపు నుంచి చూస్తే అతడు చేసింది కరెక్టే అనిపిస్తుంది. ఇక నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్న డాక్యుమెంటరీ కోసం నయనతార పెద్ద మొత్తంలోనే డబ్బు తీసుకున్నారట! పూర్తిగా వ్యక్తిగతమైన తన పెళ్లి రైట్స్ ను కూడా అమ్ముకొని డాక్యుమెంటరీకి ఓకే చెప్పారట! తను డబ్బులు పెట్టి సినిమా తీస్తే, దాన్ని తన ప్రేమ కోసం వాడుకున్న నయనతార, ఇప్పుడు అదే సినిమాను తన డాక్యుమెంటరీ కోసం కూడా వాడుకోవడం, పైగా దాన్ని అమ్ముకోవడంపై ధనుష్ గుర్రుగా ఉన్నాడట! తాను మాత్రం సినిమా రైట్స్‌ను ఫ్రీగా ఎందుకివ్వాలన్నది ధనుష్ వెర్షన్. ఇదిలా ఉంటే ధనుష్ పంపించిన లీగల్ నోటిస్‌కు నయన్ బహిరంగ లేఖతో సమాధానం ఇచ్చినప్పటికీ కోర్టు ముందు ఆమె వాదనలు నిలబడవు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. తన సొంత ఫోన్ నుంచి షూట్ చేసిన క్లిప్స్ నెట్ ఫ్లిక్స్ కోసం వాడామని నయన్ చెబుతున్నారు కానీ అదికూడా ధనుష్‌కు చెందిన ప్రాపర్టీ కిందకే వస్తుంది.
- DhanushNayantharaDhanush Nayanthara fightNayanthara open letterNetflix documentaryNOC issueDhanush legal noticeNanum Rowdy DhanVignesh ShivanNayanthara and Vignesh Shivan relationshipNayanthara Best Actress awardDhanush comments on Nayanthara actingNayanthara marriage rightscopyright violationfilm industry feudDhanush reaction