ధనుష్.. తమిళ్ ఇండస్ట్రీలో అయన పెద్ద స్టార్, తెలుగులో కూడా ధనుష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అందుకే అయన సినిమాలకు తెలుగులో కూడా మంచి కలెక్షన్లు వస్తాయి. మొదటిసారిగా తెలుగు దర్శకుడితో తమిళ, తెలుగు భాషల్లో సార్ సినిమా తెరకేక్కిన్చారు. ఈ సినిమానాను ప్రముఖ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ పిచ్చర్స్ నిర్మించాయి. కథ విషయానికి వస్తే ... 1900-2000 దశకంలో కార్పొరేట్ కాలేజీల హావ మొదలు అయింది . ఇంజనీరింగ్ […]

ధనుష్.. తమిళ్ ఇండస్ట్రీలో అయన పెద్ద స్టార్, తెలుగులో కూడా ధనుష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అందుకే అయన సినిమాలకు తెలుగులో కూడా మంచి కలెక్షన్లు వస్తాయి. మొదటిసారిగా తెలుగు దర్శకుడితో తమిళ, తెలుగు భాషల్లో సార్ సినిమా తెరకేక్కిన్చారు. ఈ సినిమానాను ప్రముఖ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ పిచ్చర్స్ నిర్మించాయి.

కథ విషయానికి వస్తే ... 1900-2000 దశకంలో కార్పొరేట్ కాలేజీల హావ మొదలు అయింది . ఇంజనీరింగ్ చదువుల డిమాండ్ పెరగడంతో తల్లి తండ్రులు తమ పిల్లలకి మంచి చదువుని అందించాలని ప్రవైట్ కాలేజీ చదువుల వైపు మొగ్గు చూపేవారు. ప్రభుత్వ కాలేజీలో మంచి టీచర్లు ఉండరు కాబట్టి కొంతమంది దీని అవకాశంగా తీసుకొని స్వార్థంతో చదువును వ్యాపారంగా మారుస్తారు . ప్రభుత్వకాలేజీల్లో టీచర్లని డబ్బు ఆశ చూపించి తన ప్రయోజనాల కోసం స్టూడెంట్స్ జీవితాలతో ఆదుకుంటాడు త్రిపాఠి .ఇతను త్రిపాఠి విద్య సంస్థల మరియు ప్రైవేట్ కాలేజీల అధినేత (సముద్ర ఖని ). ప్రైవేట్ కాలేజీ చదువులకి ఫీస్లు కట్టలేక ,ప్రభుత్వ కాలేజీ ల్లో సరైన చదువులు లేక చాల మంది స్టూడెంట్స్ చదువు ఆపేస్తారు . దానితో స్టూడెంట్స్ గొడవ చేస్తారు. దాంతో త్రిపాఠి కొత్త వ్యూహాన్ని రచిస్తాడు. ప్రభుత్వ కాలేజీ లని కూడా వాళ్లే దత్తత తీసుకొని నడిపిస్తామని గవర్నమెంట్ కి చెపుతాడు . వాళ్ళ కాలేజీ ల్లో అనుభవం లేని జూనియర్ లెక్చరర్లని అక్కడకి పంపి నాణ్యత లేని చదువు ని అందించాలనేది త్రిపాఠి ప్లాన్ . తన వ్యాపారం నష్టపోకుండా ఉండటానికి స్టూడెంట్స్ జీవితాలతో ఆదుకుంటాడు .

త్రిపాఠి కాలేజీలో జూనియర్ లెక్చరర్‏గా జాయిన్ అయ్యి సిరిపురం ప్రభుత్వ కాలేజీ కి వెళ్తాడు బాల గంగధర తిలక్ అనే బాలు (ధనుష్). కాడికి వెళ్లిన బాలుకి తల్లి తండ్రులు అక్కడ పిల్లని చదువు ఎందుకు మనిపించాలి అనుకుంటున్నారో ,అక్కడ అసలు ఎం జరుగుతుందో అనే నిజాలు తెలుస్తాయి అక్కడ కాలేజీలో బయాలజీ లెక్చరర్ (సంయుక్త మీనన్) బాలుకి సహాయంగా ఉంటుంది. ఆపైన త్రిపాఠికి బాలు మధ్య ఎలాంటి గొడవలు వచ్చాయి, త్రిపాఠిని ఎదురించి బాలు అక్కడ గవర్నమెంట్ కాలేజీ చదువుని ఎలా మెరుగు పరిచాడు అనేది కథ .

రివ్యూ : ఇప్పటికి చదువుల విషయంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి .కాబ్బటి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో ఒక కామన్ మెన్ కేరక్టర్‏లో ధనుష్ ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్‏ని బాలన్స్ చేస్తూ నటించిన విధానం బాగుంది. విలన్ పాత్రలో సముద్రఖని ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రెసిడెంట్ పాత్రలో ఈ సినిమాలో కనిపించారు విలక్షణ నటుడు సాయి కుమార్. లవ్ ట్రాక్ అంత ఆసక్తి గా లేకపోయినా హీరోతో పటు సమానంగా కనిపించే పాత్ర హీరోయిన్ సంయుక్త మీనన్ ది చాల చక్కగా నటించారు. ప్రత్యేకమైన పాత్రలో సుమంత్ , ఇంకా హైపర్ అది కూడా ఈ సినిమా లో మనం చూస్తాం. విద్య అనేది గుడిలో దొరికే ప్రసాదం లాంటిది. అది అందరికి దొరకాలి లాంటి కొన్ని డైలాగ్స్ మాత్రం చాల ఆకట్టుకొనేలా ఉన్నాయి.

ఇక ముఖ్యం గా సినిమా కథ కి మరింత బలం చేకూర్చేలా చేసింది బ్యాగ్రౌండ్ మ్యూజిక్, G.V ప్రకాష్ సంగీతం కూడా అందరికీ నచ్చుతుంది.. మాస్టారు మాస్టారు అనే పాట సినిమాలో హైలైట్‏గా నిలిచింది. యువరాజ్ కెమెరా పనితనం అందర్నీ ఆకట్టు కునేలా ఉంది. కథలో మనం ఎలాంటి ట్విస్టులు లాంటివి ఉహించనవసరం లేదు . టెక్నికల్‏గా ఎలాంటి లోపాలు లేవు ఈ సినిమాకి . అక్కడక్కడా మంచి పాటలు,ఫైట్స్ తో ప్రేక్షకులను బాగానే అలరించారు
మొదటి భాగం పర్వాలేదు అనిపించినా రెండవ భాగంలో ఎమోషనల్ డ్రామా సీన్స్‏తో ధనుష్ ఇంకా సముద్రఖని మధ్య సన్నివేశాలతో ఆసక్తి‏గా నడుస్తుంది. కథ మీద ఇంకాస్త డెప్త్ వర్క్ చేస్తే బాగుండేది . కథలో కొంచెం లాగ్ ,కొంచెం డ్రమాటిక్ గా ఉండటం మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవాలి. సినిమాలో కొన్ని సీన్స్ ముందు సినిమాల్లో మనకు చూసినట్లుగా అనిపిస్తుంది .

Updated On 21 Feb 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story