డైరెక్టర్ వెంకీ అట్లూరి 2018లో ’తొలి ప్రేమ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి చిత్రంతో హిట్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో చోటు సంపాదించాడు ఈ డైరెక్టర్. ఇక ’మిస్టర్ మజ్నూ, రంగ్ దే‘ సినిమాలు బాక్సీఫ్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మంచి కథతో కోలీవుడ్ హీరో ధనుష్ తో బై లాంగువల్ సినిమా చేశాడు వెంకీ. ఈ సినిమా తమిళ్ లో ‘వాతి’ తెలుగులో ‘సార్’ పేరుతో విడుదల కాబోతుంది. […]
డైరెక్టర్ వెంకీ అట్లూరి 2018లో ’తొలి ప్రేమ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి చిత్రంతో హిట్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో చోటు సంపాదించాడు ఈ డైరెక్టర్. ఇక ’మిస్టర్ మజ్నూ, రంగ్ దే‘ సినిమాలు బాక్సీఫ్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మంచి కథతో కోలీవుడ్ హీరో ధనుష్ తో బై లాంగువల్ సినిమా చేశాడు వెంకీ.
ఈ సినిమా తమిళ్ లో ‘వాతి’ తెలుగులో ‘సార్’ పేరుతో విడుదల కాబోతుంది. అయితే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ టీమ్. ఒక తెలుగు యంగ్ డైరెక్టర్ తమిళ్ స్టార్ హీరోతో సినిమా చేస్తుండటంతో మొదటి నుంచి మాంచి హైప్ తెచ్చుకుంది ఈ సినిమా. పోస్టర్లు, టీజర్ల రిలీజ్ తో అటు తమిళ నాడు ఫ్యాన్స్, ఇటు తెలుగు ఫ్యాన్స్ లోనూ ’సార్‘ సినిమా ఆశలు పెంచింది.
ఈ ట్రైలర్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్లతో ఓపెనింగ్ ఇచ్చి సినిమాపై ఇంకొంత హోప్ ని క్రియేట్ చేశారు. సినిమా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద షూట్ చేసినట్టు కనిపిస్తోంది. సినిమాలో ధనుష్ లెక్చరర్ గా ఉండి సిస్టమ్ ను మార్చలేక.. వకీల్ సాబ్ గా మారి ఎడ్యుకేషన్ మాఫియా సిస్టమ్ ని మార్చాడా లేదా అన్న క్వశ్చన్ మార్క్ తో ట్రైలర్ కట్ చేశారు. ధనుష్ తన యాక్టింగ్ తో తెలుగు, తమిళ అభిమాలను ఈ... య్ అనిపిస్తున్నాడు. ట్రైలర్ విడుదలైన 17 గంటల్లోనే 18 లక్షల వ్యూస్ ను సంపాదంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ధనుష్ ఫస్ట్ తెలుగులో కాస్త మాట్లాడి అభిమానులను ఉర్రూతలూగించాడు. తెలుగు కొంచెం.. కొంచెం.. అర్ధమవుతుందంటూ ఫ్యాన్స్ తో అరుపులు అరిపించారు. ఒకప్పుడు తమిళ సినిమా, కన్నడ సినిమా, మళయాళ సినిమా, హిందీ సినిమా అని మాట్లాడుకునే వాళ్లని.. ఇప్పుడు అలా కాకుండా అన్ని భాషల సినిమాలను అందరూ చూస్తూ ఇండియన్ సినిమా అని చెప్పుకునే స్థాయికి వచ్చామన్నారు వర్సెటైల్ యాక్టర్ ధనుష్.
ఇదొక అద్భుతమని తమిళ్ వాళ్లు తెలుగు సినిమాలు, తెలుగు వాళ్లు తమిళ్ సినిమాలను చూస్తున్నారని చెప్పుకొచ్చారు ఆయన. ఇదంతా ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తన అభిమాలతో చెంచుకున్నాడు ధనుష్. తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. లాస్ట్ లో ఆ సినిమాలోని మాస్టారు.. మాస్టారు.. సాంగ్ తెలుగులో పాడి అభిమాల మనసు దోచుకున్నాడు ధనుష్.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫోర్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా ధనుష్, సంయుక్త మీనన్ చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మ్యూజిక్ కంపోజర్ గా జీ.వీ ప్రకాష్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ జె. యువరాజ్ చేస్తున్నారు. శ్రకర స్టూడియోస్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న విడుదలకాబోతుంది.