తమిళ నటుడు ధనుష్(danush) గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. ఆ మాటకొస్తే హిందీ ప్రేక్షకులకు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆ విలక్షణమైన నటుడు టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ ఆఖరికి హాలీవుడ్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. హాలీవుడ్లో ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది పక్కీర్(Extraordinary Journey of the Pakhir), ది గ్రే మ్యాన్(The Gray Man) చిత్రాలలో నటించారు. అంతకు ముందే రాంజానా(Ranjana), అట్రాంగిరే(Atrangi Re) చిత్రాలతో హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

Danush In Bollywood Movie

ఇక ఇటీవల తెలుగులో సార్(sir) చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టారు. కాగా ప్రస్తుతం తమిళంలో కెప్టెన్ మిల్లర్(Captain Miller) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత స్వీయ దర్శకత్వంలో తన 50వ చిత్రాన్ని చేయనున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి బాలీవుడ్ చిత్రం(Bollywood) చేయడానికి సిద్ధం అవుతున్నారట. ఇంతకు ముందు ధనుష్ నటించిన రెండు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించింది ఆనంద్ ఎల్ రాయ్(Anand L Roy).. ఇప్పుడు మూడో సినిమాకు కూడా ఈయనే దర్శకత్వం వహించబోతున్నారు.
వైవిధ్యభరిత ప్రేమ కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నారట! ఈ సినిమాకు తేరే ఇష్క్ మైన్(Tere Ishq Mein) అనే టైటిల్‌ను నిర్ణయించినట్టు ధనుష్ తెలిపారు. ఈ సినిమా వైమానిక దళం నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ధనుష్ తన 50వ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ హిందీ సినిమాలో నటిస్తారా? లేకపోతే ఈ సినిమానే 50వ సినిమా అవుతుందా? అదీ కాకపోతే ఏకకాలంలో రెండు చిత్రాలు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడు మాత్రం ధనుష్ కాన్‌సంట్రేషన్ అంతా కెప్టెన్ మిల్లర్‌పైనే ఉంది.