ఇది ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్‌ స్టోరీ(Crime Story). ఆ భయానక కథ వింటుంటే అప్రయత్నంగా వణుకు మొదలవుతుంది. ఇప్పుడా మర్డర్‌ మిస్టరీని డ్యాన్సింగ్‌ ఆన్‌ ది గ్రేవ్‌(Dancing On The Grave)గా తెరకెక్కించారు. యధార్థ కథ ఆధారంగా తీసిన ఈ వెబ్‌ సిరీస్‌(Web Series) పాపులరయ్యింది కూడా! అనగనగా ఓ ప్రేమ.. తర్వాత పెళ్లి.. అటు పిమ్మట మిస్సింగ్‌.. ఆపై మర్డర్‌.. వీటిపైనే ఈ సిరీస్‌ రూపొందించారు.

ఇది ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్‌ స్టోరీ(Crime Story). ఆ భయానక కథ వింటుంటే అప్రయత్నంగా వణుకు మొదలవుతుంది. ఇప్పుడా మర్డర్‌ మిస్టరీని డ్యాన్సింగ్‌ ఆన్‌ ది గ్రేవ్‌(Dancing On The Grave)గా తెరకెక్కించారు. యధార్థ కథ ఆధారంగా తీసిన ఈ వెబ్‌ సిరీస్‌(Web Series) పాపులరయ్యింది కూడా! అనగనగా ఓ ప్రేమ.. తర్వాత పెళ్లి.. అటు పిమ్మట మిస్సింగ్‌.. ఆపై మర్డర్‌.. వీటిపైనే ఈ సిరీస్‌ రూపొందించారు. ఈ మర్డర్‌ కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్న స్వామి శ్రద్ధానంద(Swami Shraddhanand) లెటెస్ట్‌గా ఈ వెబ్‌ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్‌ చేసిన ఇండి యా టు డే, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలకు లాయర్‌ నోటీసులు పంపించాడు. తాను సుప్రీంకోర్టు(Supreme Court)లో రిట్‌ పిటిషన్‌(writ petition) వేశానని, ఈ టైమ్‌లో తన గురించి వెబ్‌ సిరీస్‌ తీయడం మంచిది కాదని నోటీసులో పేర్కొన్నారు. ఇది ఓ రకంగా న్యాయాన్ని అతిక్రమించడమేనని అన్నారు. తన హక్కులకు భంగం కలిగిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ను వెంటనే ఆపేయాలని, లేకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. కోర్టుకు అయ్యే 55 వేల రూపాయల ఖర్చును తీరే తమకు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించాడు.

అసలు జరిగిందేమిటంటే... మైసూర్‌ దివాన్‌ మీర్జా ఇస్మాయిల్‌ మనవరాలు షాకీరే ఖలీలి.. సౌందర్యరాశి అయిన ఆమెకు భారతీయ దౌత్యవేత్త ఇరాన్‌ అక్బర్‌ను ఇచ్చి పెళ్లి చేశారు. వృత్తి రీత్యా ఇరాన్‌ అక్బర్‌ ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉండాల్సి వచ్చేది. భార్యతో దూరం పెరిగింది. ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఇక అతడితో కలిసి ఉండటం కుదరదని అనుకున్నారు షాకీరే. వెంటనే విడాకులు ఇచ్చేశారు. అప్పటికీ ఆమెకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. విడాకులు ఇచ్చిన ఆరు నెలలలోపే స్వామి శ్రద్ధానందను పెళ్లి చేసుకున్నారు షాకీరే! అన్నట్టు స్వామి శ్రద్ధానంద అసలు పేరు చెప్పలేదు కదూ! మురళీ మనోహర్‌ మిశ్రా! శ్రద్ధానందను పెళ్లి చేసుకున్న తర్వాత షాకీరే తన కుటుంబానికి దూరమయ్యారు. షాకీరేను చూడటానికి కూడా ఎవరూ వచ్చేవారు కాదు! పెళ్లి జరిగిన మూడేళ్లకే అంటే 1991లో షాకీరే సడన్‌గా కనిపించకుండాపోయారు. అంతటా వెతికారు. ఎక్కడా ఈమె ఆచూకి కనిపించలేదు. మూడేళ్ల విచారణ అనంతరం 1994లో కేసులో కాస్తంత పురోగతి కనిపించింది. షాకీరేను హత్య చేసి తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టాడు శ్రద్ధానంద స్వామి. పోలీసులు అక్కడ తవ్వితే ఆమె అస్థిపంజరం బయటపడింది. షాకీరేకు నిద్రమాత్రలు ఇచ్చి బతికున్నప్పుడే పాతిపెట్టాడా దుర్మార్గుడు. ఆమె చేతి గోర్లలో చెక్క పొట్టు ఉందని రిపోర్టుల్లో తేలింది. అంటే చెక్క పెట్టేలోంచి బయటపడేందుకు ఆమె ఆఖరిక్షణం వరకు ప్రయత్నించిందని తెలుస్తోంది. సుప్రీంకోర్టు స్వామి శ్రద్ధానందను దోషిగా నిర్ధారించింది. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మధ్యప్రదేశ్‌ సాగర్‌లోని సెంట్రల్‌జైలులో గత 30 ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్నాడు శ్రద్దానంద! షాకీరేను పూడ్చిపెట్టిన తర్వాత ఆ సమాధిపై శ్రద్ధానంద పార్టీలు చేసుకున్నాడట. డాన్సులు కూడా చేశాడట! అందుకే వెబ్‌ సిరీస్‌కు డ్యాన్సింగ్‌ ఆన్‌ ది గ్రేవ్‌ అని పేరు పెట్టారు.

Updated On 26 April 2023 4:59 AM GMT
Ehatv

Ehatv

Next Story