ప్రముఖ డ్యాన్స్ షో "ఢీ" కొరియోగ్రాఫర్ గా రాణిస్తోన్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరులోని క్లబ్ హోటల్ లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు చైతన్య రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఒకటి బయటికొచ్చింది. తనకు అప్పులున్నాయని.. తీర్చుకునే సత్తా ఉంది కానీ తీర్చలేకపోతున్నాను. ఏం చేయాలో, ఎలా తీర్చాలో అర్థంకావడం లేదని చైతన్య ఆ వీడియోలో పేర్కొన్నాడు.

Dance Master Chaitanya Commits Suicide Due to Financial Struggles
ప్రముఖ డ్యాన్స్ షో "ఢీ" కొరియోగ్రాఫర్(Choreographer) గా రాణిస్తోన్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య(Chaitanya) బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరులోని క్లబ్ హోటల్(Nellore Club Hotel) లో అతను ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు చైతన్య రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో(Selfie Video) ఒకటి బయటికొచ్చింది. తనకు అప్పులున్నాయని.. తీర్చుకునే సత్తా ఉంది కానీ తీర్చలేకపోతున్నాను. ఏం చేయాలో, ఎలా తీర్చాలో అర్థంకావడం లేదని చైతన్య ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు చైతన్య సారీ చెప్పాడు. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, మరో దారి లేక ఇలా చేస్తున్నానని వీడియో ద్వారా తెలిపాడు. ఒక అప్పును తీర్చేందుకు మరో అప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయని వెల్లడించాడు. తనకంటూ ఒక నేమ్, ఫేమ్ ఇచ్చిన ఢీ షోకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చైతన్య మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి కేసు నమోదు చేసుకున్నారు.
