దక్షా నగార్కర్ ఈ బ్యూటీ హుషారు, జాంబిరెడ్డి లాంటి చిత్రాలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మాయి పుట్టింది ముంబైలోనే అయినప్పటికీ.. తల్లిండ్రులు ఉద్యోగ రిత్యా హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో ఉండేవారు.
ఈ ముద్దుగుమ్మ 1995 జులై 12న ముంబైలో పుట్టింది. అయితే ముంబై యూనివర్సిటీలో బీబీఏ పూర్తి చేసింది దక్షా. తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈ భామ డాన్స్ కూడా నేర్చుకుంది.
ఢిల్లీలో ఈ అమ్మడు విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఫ్రెండ్స్ సలహాతో బ్యూటీ కాంటెస్ట్ లో పోటీ చేయడంతో అనుకోకుండా విజేతగా నిలిచింది ఈ భామ. ఇక అప్పటి నుంచి దక్షాకి మోడలింగ్ లో అవకాశాలు వెల్లువెత్తాయి.
ఇక తర్వాత 2008లో కన్నడ చిత్రాల్లో బాల నటిగా ఎంటర్ అయింది దక్షా. చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తుండటంతో సినిమారంగంలోకి అడుగులు పడ్డాయి. 2014లో వచ్చిన ‘ఏకే రావు పీకే రావు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది దక్షా.
ఆ తర్వాత 2015లో వచ్చిన ‘హోరాహోరీ చిత్రంలోనూ మెరిసింది ఈ స్మైలీ బ్యూటీ దక్షా. ‘హుషారు’ సినిమాలో గీతా అనే క్యారెక్టర్ తో దక్షా నగార్కర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత వచ్చిన ‘జాంబిరెడ్డి’లో హీరోయిన్ గా నటించి కెరీర్ లో మంచి హిట్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మాయి. ఇటు నాగార్జున హీరో ‘బంగార్రాజు’ చిత్రంలోనూ ఒక సాంగ్ లో తళుక్కుమని ఫ్యాన్స్ ను అలరించింది.
ఈ భామకు బాలీవుడ్ స్టార్ హీరో షాక్ ఖాన్ అంటే బాగా ఇష్టమట. అలాగే పుస్తకాలు చదవడం, డాన్స్ చేయడం, సినిమాలు చూడటం ఇష్టమట ఈ ‘హుషారు’ పిల్లకి.
ఈ భామ తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ కూడా మాట్లాడుతుందట. అయితే భామ ఫిట్ నెస్ గా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుందట. ఇక దక్షా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తన ఫిట్ నెస్ ఫొటోలను షేర్ చేస్తుంది.
తాజాగా ఈ భామ ‘జహా ఛలే.. వో బోలే సితారా’ అనే క్యాప్షన్ తో ఫోటోలను షేర్ చేసింది హుషారు భామ. దక్షా ఈజ్ గ్లోరియస్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ అమ్మడికి 4 లక్షలకిపైగా ఫాలోవర్లు ఉన్నారు.