తెలుగు సినిమాకి గ్లామర్ డాల్స్ కి కొదవలేదు. తన గ్లామర్(Glamour) తో కుర్రాళ్లకి హీట్ ఎక్కిస్తున్న ముద్దుగుమ్మల్లో దక్ష నగర్కర్(Daksha Nagarkar) టాప్ లిస్టులో ఉంటుంది. తక్కువ సినిమాల్లో నటించినా కొంతమంది బ్యూటీలు సోషల్ మీడియాలో(Social Media) మాత్రం మంచి క్రేజ్ అందుకుంటుంటారు.
ఇండస్ట్రీ లో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తమ గ్లామర్ తో ఫాలోవర్స్ ని ఒక రేంజ్ లో పెంచుకుంటుంటారు. ఇలాంటి వారిలో దక్ష నగర్కర్ మొదటి వరసలో నిలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ఫోటో షేర్ చేసినా నిముషాల్లో వైరల్ అవుతుంటాయి.
లేటెస్ట్ గా మరో సారి తన అందాలు ఆరబోస్తూ పెట్టిన ఫొటోస్(Photos) నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్కై బ్లూ కలర్ టీషర్టు(sky blue T-shirts), జీన్స్ ప్యాంట్(Jeans Pants) లో దక్ష ఎంతో గ్లామర్ గా కనిపించింది. గతంలో ఇంతకంటే అందాలు ఆరబోస్తూ ఎన్నో ఫోటోలు షేర్ చేసింది. రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ లో మాత్రం చాలా అందంగా ఉందంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు ఫాన్స్. టైట్ అవుట్ ఫిట్స్(Tight Outfit) వేసి, కంటి చూపుతోనే మత్తు ఎక్కిస్తున్న బ్యూటీ అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.
2014 లోనే ఇండస్ట్రీ కి వచ్చినా, ఇప్పటివరకు దక్ష కి సినిమా పరంగా హిట్ రాలేదనే చెప్పాలి. తేజ దర్శకత్వం వహించిన హోరాహోరీ తో తన అదృష్టాన్ని పరికించుకున్నా ఫలితం దక్కలేదు. తరవాత ఈ బ్యూటీ నటించిన జాంబిరెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే సక్సెస్ అయినా, అవకాశాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు
నాగార్జున బంగార్రాజు లో స్పెషల్ సాంగ్, రవితేజ రావణాసుర సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించింది. ఆ రెండు సినిమాలు కూడా దక్ష కెరీర్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. అయినప్పటికీ ఎక్కడ వెనక్కి తగ్గకుండా తన గ్లామర్ డోస్ పెంచి మరీ సోషల్ మీడియాలో క్రేజ్ అందుకుంటోంది. ఈ అందాల ఎరతోనైనా రాబోయే రోజుల్లో అమ్మడు అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.