ఎన్నికల వేళ రాజకీయ సినిమాలు(Political movie) రావడం సర్వ సాధారణం. ఎన్టీఆర్‌(Sr.Ntr) రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఈ ట్రెండ్‌ మొదలయ్యింది. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా అప్పట్లో చాలా సినిమాలు వచ్చాయి. చిరంజీవి(Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా రాజకీయ అంశాలు ముడిపడి ఉన్న సినిమాలు తెరమీదకు వచ్చాయి.

ఎన్నికల వేళ రాజకీయ సినిమాలు(Political movie) రావడం సర్వ సాధారణం. ఎన్టీఆర్‌(Sr.Ntr) రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఈ ట్రెండ్‌ మొదలయ్యింది. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా అప్పట్లో చాలా సినిమాలు వచ్చాయి. చిరంజీవి(Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా రాజకీయ అంశాలు ముడిపడి ఉన్న సినిమాలు తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సందడి మొదలయ్యింది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలను రూపొందిస్తున్నారు. వ్యూహం(Vyuham) మొదటి భాగం ఆల్‌మోస్టాల్‌ చివరి దశకు వచ్చేసింది. రెండో భాగాన్ని శపథం(shapatham) పేరుతో విడుదల చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా సైకిల్(Cycle) పేరుతో ఓ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ(Balakrishna), పవన్ కల్యాణ్(Pawan kalyan) ఫొటోలతో రిలీజైన ఈ పోస్టర్ లో ఇది పసుపు చరిత్ర అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. శివాజీ క్రియేషన్స్ లో వస్తున్న ఈ సినిమాకి జి.శివప్రసాద్(G.shivaprasad) డైరెక్టర్. రాజకీయాల్లో ఈ మూవీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసమే ఈ సినిమా తెరపైకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి అనుకూలంగా యాత్ర 2, వ్యూహం సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే.

Updated On 28 Oct 2023 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story