టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్(Drugs) దుమారం రేగింది. తాగాజా కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరిని(KP Chowdhary) సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి కొకైన్(Cocaine) స్వాధీనం చేసుకున్నారు. అతడి దగ్గర ఉన్న నాలుగు సెల్‌ఫోన్లను(Cellphone), ల్యాప్‌టాప్‌ను(Laptop) తీసుకున్నారు. కేపీ చౌదరితో చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు టచ్‌లో ఉన్నారని పోలీసులు గుర్తించారు.
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్(Drugs) దుమారం రేగింది. తాగాజా కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరిని(KP Chowdhary) సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి కొకైన్(Cocaine) స్వాధీనం చేసుకున్నారు. అతడి దగ్గర ఉన్న నాలుగు సెల్‌ఫోన్లను(Cellphone), ల్యాప్‌టాప్‌ను(Laptop) తీసుకున్నారు. కేపీ చౌదరితో చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు టచ్‌లో ఉన్నారని పోలీసులు గుర్తించారు. కేపీ చౌదరి కాల్‌లిస్ట్‌లో ఇద్దరు స్టార్ హీరోయిన్లతో పాటు నలుగురు మహిళా ఆర్టిస్టులు ఉన్నారని సమాచారం. ఈ లింక్ వెనుక ఓ ప్రముఖ డైరెక్ట్ కూడా ఉన్నట్టు పోలీసులు పసిగట్టారు. కేపీ చౌదరి ఏర్పాటు చేసే పార్టీలకు ఎవరెవరు హాజరవుతున్నారు? ఇప్పటికే హాజరైన సినీ ప్రముఖులు ఎవరు? అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. తవ్విన కొద్దీ చౌదరి నుంచి డ్రగ్స్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
వాట్సాప్‌తో అతడు ఎవరెవరికి చాటింగ్ చేశాడో తెలుసుకుంటున్నారు. మరోవైపు డ్రగ్స్ కింగ్‌పిన్ గాబ్రియెల్(Kingpin Grabiel) కోసం పోలీసులు వెతుకుతున్నారు. గతంలో హీరోయిన్ ఛార్మీ(charmi), దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannath), హీరోలు రవితేజ(Raviteja), నవదీప్(Navdeep), రానా(Rana), నందు(nandhu), తరుణ్(tharun), ఆర్టిస్టు ముమైత్ ఖాన్‌లను(Mumait Khan) డ్రగ్స్ లింకుల గురించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రశ్నించింది. వీరి బ్యాంకు లావాదేఈలను పరిశీలించింది. సుమారు రెండు నెలల పాటు విచారణ కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎవరూ డ్రగ్స్ వాడినట్టుగా ఆధారాలు దొరకలేదు. అందుకే అప్పడు డ్రగ్స్ కేసును మూసివేశారు.