సోషల్ మీడియాలో తప్పుడు కథనాలే కాదు, తప్పుడు ఫోటోలు, వీడియోలు కూడా వస్తున్నాయ. టెక్నాలజీ సాయంతో కొందరు దగుల్బాజీలు రెచ్చిపోతున్నారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకుని మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు సృష్టిస్తున్నారు. వారిని మానసికంగా వేధిస్తున్నారు. ఇప్పటికే కాజోల్, రష్మిక మందన్నా, కత్రినా కైఫ్ డీప్ ఫేక్ వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు నటి అలియాభట్‌ను టార్గెట్ చేశాను.
సోషల్ మీడియాలో(Social media) తప్పుడు కథనాలే కాదు, తప్పుడు ఫోటోలు(Fake photo), వీడియోలు(Fake video) కూడా వస్తున్నాయ. టెక్నాలజీ(Technology) సాయంతో కొందరు దగుల్బాజీలు రెచ్చిపోతున్నారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకుని మార్ఫింగ్ వీడియోలు(Morphing Videos), ఫోటోలు సృష్టిస్తున్నారు. వారిని మానసికంగా వేధిస్తున్నారు. ఇప్పటికే కాజోల్(Kajol), రష్మిక మందన్నా(Rashmika Mandanna), కత్రినా కైఫ్(Katrina Kaif) డీప్ ఫేక్(Deep Fake Video) వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు నటి అలియాభట్‌ను(Alia Bhatt) టార్గెట్ చేశాను. అసభ్యకరంగా ఉన్న ఓ మహిళా వీడియోకు అలియాభట్ ముఖాన్ని జత చేశారు. అలా ఫేక్ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీన్ని చూసిన నెటిజన్లు బాధ్యులను తిట్టిపోస్తున్నారు. ఓ నటిమణిని మానసికంగా ఇబ్బంది పెట్టడం మంచిదికాదని అంటున్నారు. వాళ్లు సినిమా నటులే కావచ్చు , కానీ ఓ ఇంటి మహిళలే కదా అని చెబుతున్నారు. ఇలాంఇ ఫేక్ వీడియోలతో వారితో పాటు వారి కుటుంబసభ్యులను బాధపెట్టడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజుల కిందట జారాపటేల్ అనే యువతి వీడియోకు రష్మిక మందన్నా ముఖాన్ని ఉపయోగించి ఓ వీడియోను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై అప్పుడు బిగ్‌బి అమితాబ్ బచ్చన్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, కీర్తి సురేశ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని రిక్వెస్ట్ చేశారు. కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనలు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టింది.