గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్(Ram charan) హీరోగా, శంకర్(shankar) దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్(Game changer). శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Game Changer Song Leak
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్(Ram charan) హీరోగా, శంకర్(shankar) దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్(Game changer). శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో గేమ్ చేంజర్ సినిమాలోని ఓ పాట(song) లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు సైబర్ క్రైమ్(Cyber crime) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లీక్ చేసిన ఇద్దరిని అరెస్ట్(arrest) చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు. అయితే దీపావళి సందర్బంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ పాటను దీపావళికి గ్రాండ్‌గా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. శరవేగంగా షూటిం్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ(Kiara advani) నటిస్తోంది.
మిగతా ముఖ్య పాత్రలల అంజలి, సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర నటిస్తున్నారు.
