చాలా మంది క్రికెటర్లు వెండితెరపై సందడి చేశారు. ముఖ్యంగా సంపాదనకోసం కోట్లలో రెమ్యూనరేషన్ తీసకుంటూ..బ్రాండ్ అంబాసిడర్స్ గా మారి.ఏదో ఒక ప్రాడెక్ట్ ను ప్రచారం చేస్తుంటారు క్రికెటర్లు. అటు క్రికెట్ తో పాటు ఈరకంగా కూడా కోట్లకు కోట్లు సంపాధిస్తున్నారు.

చాలా మంది క్రికెటర్లు వెండితెరపై సందడి చేశారు. ముఖ్యంగా సంపాదనకోసం కోట్లలో రెమ్యూనరేషన్ తీసకుంటూ..బ్రాండ్ అంబాసిడర్స్ గా మారి.ఏదో ఒక ప్రాడెక్ట్ ను ప్రచారం చేస్తుంటారు క్రికెటర్లు. అటు క్రికెట్ తో పాటు ఈరకంగా కూడా కోట్లకు కోట్లు సంపాధిస్తున్నారు. ఇక అందులో కొంత మంది క్రికెటర్లు మాత్రం పూర్తి స్థాయి నటులుగా అవతారం ఎత్తరు. అందులో శ్రీశాంత్(Sreesanth), ఇర్ఫాన్ పఠాన్(Irfan Patha) లాంటి వాళ్లు కొందరు ఉన్నారు. ఇర్పాన్ ఓ తమిళ సినిమా(Tamil Movie)లో విలన్ గా చేయగా, శ్రీశాంత్ ఏకంగా హీరోగానే ఓ మూవీ చేశాడు. ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి స్టార్ క్రికెటర్.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) కూడా చేరాడు.

శిఖర్ ధావన్ కు కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఆటంటే పడిచచ్చిపోతుంటారు ఆడియన్స్. టీమిండియా(Team India) తరఫున 2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 ఏళ్లు నిర్విరామంగా ఆడుతూనే ఉన్నాడు. ఇక ఈమధ్య ఎందుకో కాని కంప్లీట్ గా ఫామ్ కోల్పోవడంతో ధావన్ ని బీసీసిఐ దాదాపుగా పక్కనపెట్టేశారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్ లు మాత్రమే ఆడున్నాడు ధావన్.. ఎందుకో వాటిపై కూడా పెద్దగామనసుపెట్టడంలేదు అని అంటున్నారు. ఈక్రమంలో శిఖర్ మనసు సినిమాల వైపు మళ్ళిందని సమాచారం. ఆయన పూర్తిస్థాయిలో యాక్టర్ గా మరిపోయేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నాడట. ప్లాన్ చేసుకోవడం కాదు.. ఇప్పటికే ఒక సినిమాతో నటుడిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ధావన్.. ఇక ఆ కిక్కు నచ్చినట్టుంది.. ఇక అటువైపే అడుగులువేయాలి అని అనుకుంటున్నాడు.

అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటీ అంటే.. శిఖర్ వయస్సులో ఉన్నవారు..అంత స్టార్ డమ్ ఉన్నవారు హీరోగా ఎంట్రీ ఇవ్వాలని. అది కూడా సినిమాలు చేయాలి అనే అనుకుంటారు. కాని శిఖర్ కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు. సీరియల్స్ చేస్తూ బిజీగా అయిపోతున్నాడు. సినిమాలు కాకుండా ఆయన సీరియల్స్ చేయడం ఏంటీ..? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కూడా మారింది. వైరల్ న్యూస్ అవుతోంది.

కుండలి భాగ్య చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలుగు, హిందీ సీనియల్స్ ను ఫాలో అయ్యేవారికి ఇది బాగా తెలిసి ఉంటుంది. తెలుగులో కుంకుమ భాగ్య సీరియల్ కు కొనసాగింపుగా జీ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్.. ఫ్యామిలీ లేడీస్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ లోనే నటిస్తున్నాడు క్రికెటర్ ధావన్. పోలీస్ పాత్ర చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు రావడంతో అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. ఇక నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. బ్యాట్ పక్కన పెట్టి ాక్టర్ గా మారిపోయాడంటు ప్రచారం చేస్తున్నారు. కొంత మంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. సినిమాలు చేస్తే బాగుంటుందని మరికొంత మంది సలహాలు ఇస్తున్నారు.

Updated On 21 March 2023 6:20 AM GMT
Ehatv

Ehatv

Next Story