సినిమా తారలంటే పడిచచ్చేవాళ్లు కోకొల్లలు. వారిపై పిచ్చి ప్రేమను ప్రదర్శిస్తుంటారు. మన దగ్గరే ఇలాంటి వాళ్లు వేలకొద్దీ ఉంటారు.
సినిమా తారలంటే పడిచచ్చేవాళ్లు కోకొల్లలు. వారిపై పిచ్చి ప్రేమను ప్రదర్శిస్తుంటారు. మన దగ్గరే ఇలాంటి వాళ్లు వేలకొద్దీ ఉంటారు. తమ అభిమాన నటీనటుల సినిమా రిలీజైతే చాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. పడి చచ్చేవాళ్లు కాదు, నిజంగానే చచ్చిపోయేవాళ్లు కూడా ఉటారు. హీరోయిన్ సోనాలి బింద్రే(sonali Bendre) కోసం ఇలాగే ఓ ఫ్యాన్ చెరువులో దూకేసి చనిపోయాడు. తొమ్మిదో దశకం చివర్లో సోనాలి బింద్రే స్టార్ హీరోయిన్. హిందీలోనే కాదు తెలుగు, తమిళ భాషల్లోనూ టాప్ స్టార్. కెరీర్ పీక్ స్టేట్‌ఓ ఉన్నప్పుడే పెళ్లి చేసుకున జీవితంలో సెటిల్ అయ్యింది. కొన్నాళ్ల కిందట క్యాన్సర్ వ్యాధి బారిన పడి, దాన్ని జయించింది. ప్రస్తుతం సెలక్టెడ్ మూవీస్‌లో నటిస్తున్నారు. లేటెస్ట్‌గా ఓ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న సోనాలి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అప్పట్లో షూటింగ్ కోసం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లింది సోనాలి. ఈమెను చూడటానికి చాలా మంది షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. ఈమెను దగ్గర్నుంచి చూడాలనే కోరికతో ఓ అభిమాని చెరువులో దూకాడు. ఈత రాకపోవడంతో చనిపోయాడు. ఆ సంఘటనను తాను నమ్మలేకపోతున్నానని సోనాలి చెబుతూ ఇప్పటికీ అది వెంటాడుతూ ఉందని అన్నారు. 'క్రేజీ ఫ్యాన్ కల్చర్ నాకు అస్సలు అర్థం కాదు. ఇప్పటికీ ఆ సంఘటన గురించి పూర్వాపరాలు తెలియవు. నిజంగానే అలా జరిగిందా? అభిమాన నటిని చూడటం కోసం ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరమైన విషయం' అని విచారం వ్యక్తం చేసింది సోనాలి. అప్పట్లో మెయిల్స్, ఉత్తరాలు నాకు చాలా వచ్చేవని, కొందరు రక్తంతో ఉత్తరాలు రాసేవారని చెప్పారు. అది నిజంగా వాళ్ల రక్తమేనా? అది రక్తమేనా అనే సందేహం వచ్చేదని అన్నారు. మనుషులు తమలాంటి మరో మనిషి కోసం ఇంతలా ఎందుకు తాపత్రయపడతారో అర్థమయ్యే కాదని పేర్కొన్నారు. బాలీవుడ్‌లోని ఫ్యాన్ కల్చర్, హీరో హీరోయిన్ పట్ల అతిప్రేమ తనకు అస్సలు ఇష్టముండదని సోనాలి బింద్రే చెప్పుకొచ్చింది.